Site icon HashtagU Telugu

Health Benefits: బొప్పాయి ఆకు రసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 11 Jan 2024 06 38 Pm 6309

Mixcollage 11 Jan 2024 06 38 Pm 6309

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తరచూ బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా పెట్టవచ్చు. వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కేవలం బొప్పాయి పండు మాత్రమే కాకుండా అందులో గింజలు వాటి ఆకులు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. డెంగ్యూ వచ్చినప్పుడు జ్వరం, అలసట, తల నొప్పి, వికారం, వాంతులు మరియు చర్మ దద్దుర్లు వంటి ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. బొప్పాయి ఆకు సారం డెంగ్యూ జ్వరం ఉన్న వారిలో రక్త ప్లేట్లెట్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ప్లేట్లెట్లు సంఖ్య దారుణంగా పడి పోతుంది.
ఒక్కో సారి ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. లక్షల్లో ఉండాల్సిన పేట్లెట్ల సంఖ్య 20 లేదా 30 వేలకు పడిపోతుంది. ఇలాంటి సమయంలో బయటి వ్యక్తుల నుండి సేకరించిన రక్తంలో నుండి ప్లేట్లెట్లను వేరు చేసి రోగికి ఎక్కించాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. అలా ఒకటి రెండు సార్లు ఎక్కించిన తర్వాత ప్లేట్లెట్ల సంఖ్య కాస్త మెరుగవుతుంది. ఇలాంటి వారికి బొప్పాయి నిజమైన అమృతంలా పని చేస్తుంది. బొప్పాయి ఆకులతో చేసిన రసాన్ని రోగులు తాగితే వారి శరీరంలో రక్తం యొక్క ప్లెట్లెట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తిరిగి మాములు స్థితికి వచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయితో ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయి.

బొప్పాయి ఆకును డయాబెటిస్ మరియు అధిక రక్తంలో చక్కెర స్థాయిలకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్య పద్ధతుల్లో ఉపయోగిస్తారు. బొప్పాయి ఆకు రక్తంలో చక్కెరను తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. బొప్పాయి ఆకులోని పోషకాలు మరియు సమ్మేళనాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందది. బొప్పాయి ఆకు తరచుగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు జుట్టు ఆరోగ్యానికి మద్దతుగా ఉపయోగిస్తారు. బొప్పాయి ఆకులతో చేసిన రసాన్ని జుట్టు కుదుళ్ల నుండి కొనల వరకు మంచిగా పట్టించాలి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టు లోపలికి వెళ్లి.. జుట్టు దృడంగా తయారవుతుంది. చిట్లపోయి ఉన్నట్లు కనిపించే జుట్టును ఈ బొప్పాయి రసం నయం చేస్తుంది. తరచూ ఇలా రసాన్ని జుట్టుకు పట్టిస్తే గుర్తించదగ్గ రీతిలో ప్రయోజనం కనిపిస్తుంది. జుట్టు పట్టు కుచ్చులా నిగనిగ లాడుతుంది. బొప్పాయి ఆకులోని ఎంజైమ్లు చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, మొటిమలను నివారించడానికి మరియు మచ్చలు కనిపించడాన్ని తగ్గించడానికి ఎక్స్ఫలియంట్గా పనిచేస్తాయి.

Exit mobile version