బొప్పాయి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మన అందరికీ తెలిసిందే. బొప్పాయి ఆరోగ్యానికి అలాగే అందానికి ఎంతో మేలు చేస్తుంది. తరచుగా బొప్పాయి పండును తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వేసవికాలం అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎండలు మండిపోతున్న వేళ ఈ బొప్పాయి పండును తినవచ్చా తినకూడదా తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదట. వేసవిలో వచ్చే అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయట. బొప్పాయి తింటే ఉపశమనం కలుగుతుందట. రోజూ ఒక గిన్నె బొప్పాయి ముక్కలు తింటే అజీర్తి రాదని చెబుతున్నారు. బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ, సి, ఈ చర్మానికి తేమ, మెరుపునిస్తాయట వేసవిలో చర్మం కాంతి విహీనంగా మారుతుంది. బొప్పాయి చర్మానికి టానిక్ లా పనిచేస్తుందట. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న బొప్పాయి తినడం వల్ల కడుపు నిండుగా ఉంచుతుందట. ఇది బరువు తగ్గడానికి ఎంతో బాగా సహాయపడుతుందట.
వేసవిలో తేలికపాటి ఆహారం అవసరం అని, అందుకు బొప్పాయి మంచి ఎంపిక అని చెబుతున్నారు. బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వేసవిలో బలహీనపడే రోగనిరోధక శక్తిని పెంచుతుందట,అలాగే ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుందని చెబుతున్నారు. వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. బొప్పాయిలో 88 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరానికి తేమను అందిస్తుందట. బొప్పాయితో పాటు, నారింజ, పుచ్చకాయ, ఖర్బూజా, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువ కలిగిన పండ్లు తినడం మంచిదని చెబుతున్నారు. బొప్పాయి తినడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పదు అని చెబుతున్నారు.