Site icon HashtagU Telugu

Papaya And Pomegranate: బొప్పాయి, దానిమ్మ పండ్లు కలిపి తింటున్నారా.. అయితే ఇది మీ కోసమే?

Mixcollage 12 Mar 2024 09 05 Pm 3951

Mixcollage 12 Mar 2024 09 05 Pm 3951

మామూలుగా వైద్యులు తరచూ తాజా పండ్లను తీసుకోవాలని చెబుతూ ఉంటారు. తాజా పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని, ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో దానిమ్మ, బొప్పాయి కూడా ఒకటి. ఈ రెండు పళ్ళను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కొందరు వీటిని విడివిడిగా తింటే మరికొందరు కలిపి తింటూ ఉంటారు. కాగా దానిమ్మలో ఎల్లా గిటానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరంలో వాపు తగ్గుతుంది. ఎల్లాగిటానిన్ ఆక్సీకరణ మెదడు కణాలను ప్రోత్సహిస్తుంది.

ఇది అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి నుండి కూడా రక్షిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. మొటిమలు, నల్లని మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే చుండ్రును తగ్గించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది.బొప్పాయి, దానిమ్మ పండును కలిపి తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అదనంగా, ఇది అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ రెండు పండ్లు అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఎర్ర రక్త కణాలను ప్రోత్సహిస్తాయి. దీని వల్ల శరీరంలో రక్త కొరత ఉండదు.

రక్తహీనత వంటి వ్యాధులను నివారించడంలో పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అదే సమయంలో మలబద్ధకం, ఊబకాయం సమస్యలను దూరం చేస్తుంది. ఉత్తమమైన విషయం ఏమిటంటే, ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల శరీరంలోని మల్టీవిటమిన్ల లోపాన్ని తీరుస్తుంది. బొప్పాయి, దానిమ్మ పండును కలిపి తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అదనంగా, ఇది అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ రెండు పండ్లు అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఎర్ర రక్త కణాలను ప్రోత్సహిస్తాయి. దీని వల్ల శరీరంలో రక్త కొరత ఉండదు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ముఖ్యంగా ఈ సీజన్ లో కాపాడుతుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు .నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ జ్యూస్ ని వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. బొప్పాయి, దానిమ్మ పండ్లు రెండూ శరీరంలో మల్టీవిటమిన్స్ లాగా పనిచేస్తాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, బి, సి ఉంటాయి. దానిమ్మలో విటమిన్ సి, ఇ, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్ పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

Exit mobile version