బొప్పాయి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు. అయితే బొప్పాయిలో ఇప్పుడు చెప్పబోయే పదార్థం కలుపుకొని తింటే ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని అంటున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ పండు మీ కడుపును తొందరగా నింపడానికి, మీ బరువును తగ్గించడానికి బాగా సహాయపడుతుందట. అయితే ఇందుకోసం బొప్పాయిలో రెండు పదార్థాలను కలుపుకుని తినాలట.
చియా విత్తనాలు, బొప్పాయి కాంబినేషన్ మీరు ఈజీగా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుందట. ఎందుకంటే చియా విత్తనాలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది మీ కడుపును తొందరగా నింపుతుందట. అలాగే మీకు ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచుతుందట. అలాగే దీనిలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయని, దీనిలోని ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. అలాగే మీ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి బాగా సహాయపడుతుందట. అందుకే బొప్పాయి, చియా విత్తనాలు వెయిట్ లాస్ కు బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు.
ముందుగా ఒక కప్పు బొప్పాయి ముక్కలను తీసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ చియా విత్తనాలను వేసి బాగా కలపాలి. దీన్ని డైరెక్ట్ గా తినచ్చట. బరువు తగ్గాలనుకునే వారికి ఈ కాంబినేషన్ బాగా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. బొప్పాయి, చియా సీడ్స్ తో పాటుగా మీరు బొప్పాయి, అవిసె గింజలను కూడా తినవచ్చట. ఈ రెండు మీరు బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయట. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటాయట. ఇవి బొప్పాయిలో కూడా ఉంటాయట. ఈ రెండింటి కాంబినేషన్ మీరు సులువుగా బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయని చెబుతున్నారు. ఇందుకోసం ఒక కప్పు బొప్పాయి ముక్కలను తీసుకొని, దీనిలో ఒక స్పూన్ అవిసె గింజలను వేసి బాగా మిక్స్ చేసి స్నాక్స్ గా కూడా తినవచ్చు. వీటితో పాటు మీరు బరువు తగ్గాలంటే చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీరు క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలి. అలాగే రెగ్యులర్ గా శారీరక శ్రమ చేయాలి. ఈ శారీరక శ్రమే మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుందని చెబుతున్నారు.