Site icon HashtagU Telugu

Panipuri Benefits : పానీపూరి వల్ల నష్టాలు మాత్రమే కాదండోయ్ లాభాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..

Panipuri Does Not Only Have Its Disadvantages But Also Its Advantages.. That Is..

Panipuri Does Not Only Have Its Disadvantages But Also Its Advantages.. That Is..

Benefits of Eating Panipuri : పానీపూరి.. ఈ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ ని ఇష్టపడని వారు ఉండరు. ఇది ఒక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పానీ పూరిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. సాయంత్రం అయ్యింది అంటే చాలు పానీ పూరి బండి వద్ద బారులు తీస్తూ ఉంటారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ పానీపూరీకి రోజురోజుకు ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారు. బయటకు అలా సరదాగా వెళ్లారంటే ఈ పానీపూరి (Panipuri) తినకుండా అస్సలు ఉండలేరు. అయితే కొంతమంది బాగా ఇష్టంగా తింటే మరి కొంతమంది వాటి వల్ల అనారోగ్యాలు వస్తాయని, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయని వాటిని తినడానికి ఆసక్తిని చూపించరు. అయితే పానీపూరి (Panipuri) వల్ల ఆరోగ్య సమస్యలు కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి పానీపూరి వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

చాలామంది పానీ పూరి అనగానే రోడ్డు పక్కన డ్రైనేజ్ కాలువల దగ్గర చేస్తుంటారు. ఆ ప్రదేశం బాగుండదు అని అనుకుంటూ ఉంటారు. ఆ శుభ్రత అనేది ఆ పానీపూరి వ్యాపారం పై ఆధారపడి ఉంటుంది. మరి వీటి వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే.. మాములుగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఏది తినాలన్నా భయ పడిపోతూ ఉంటారు. ఏది తిన్నా బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇలా షుగర్ తో బాధ పడేవారు ఎలాంటి టెన్షన్ లేకుండా పానీ పూరి తినవచ్చు. పానీ పూరిలో కేలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిదే కదా అని మితిమీరి మాత్రం తీసుకోకూడదు. అలాగే పానీ పూరిలో మీ శరీరానికి అవసరం అయిన పోషకాలు లభ్యమవుతాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

కాబట్టి పానీ పూరి తినడం వల్ల ఐరన్ లోపంతో నుంచి బయటపడవచ్చు. పానీ పూరిలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఫోలేట్, విటమిన్లు ఏ, బి6, బి12, సీ, డీ వంటివి ఉంటాయి. పానీ పూరి అంటే చాలా మందికి ఇష్టం. పానీ పూరి తినడానికి కాలంతో పని లేదు. ఇది మానసిక స్థితి మెరుగు పరుస్తుంది. ఎలాంటి మూడ్ లో ఉన్నా మీ మానసిక స్థితి వెంటనే చేంజ్ అయి పోతుంది. పానీ పూరి తినడం వల్ల తక్షణమే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అంతే కాకుండా నోటి బొబ్బలు ఉన్న వారు తిన్నా ఉపశమనం లభిస్తుంది.

Also Read:  Plane Lands On River: రన్‌వేపై కాకుండా నదిపై దిగిన విమానం.. ఎక్కడంటే..?