Site icon HashtagU Telugu

Shoulder Pain: భుజం నొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా..? ప్రమాదం పొంచి ఉంది…!!

Shoulder Pain

Shoulder Pain

ఈ మధ్యకాలంలో చాలామంది భుజం నొప్పితో బాధపడుతున్నారు. అది కండరాల్లో సమస్య కావచ్చు…జాయింట్స్ సమస్య కావచ్చు. లేదంటే షోల్డర్ జాయింట్ పట్టేసి ఉండొచ్చు. అందుకే భుజంలో నొప్పి ఏదైనా…నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ఈ నొప్పి దీర్ఘకాలం పాటు కొనసాగినట్లయితే…అది చికిత్సకు కూడా లొంగకుండా తయారవుతుంది.

భుజం నొప్పి తరచుగా వస్తుంటే…వైద్యుల వద్దకు వెళ్లి టెస్టు చేయించుకుంటే సమస్య ఏంటనేది తెలుస్తుంది. దాంతో చికిత్స కూడా సులభం అవుతుంది. పట్టేసినట్లుగా, నొప్పిగా కొన్నిరోజులపాటు ఉంటే…అది భుజంపై పడుకోవడం సరిగ్గా రావడంలేదని అర్థం. సమస్యను ముందుగా గుర్తించడం ఒక్కటే మార్గమని తెలుసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే..అది దీర్ఘకాల సమస్యగా మారిపోతుంది.

కండరాలు, స్నాయువులు, లిగమెంట్లు కలసి షోల్డర్ జాయింట్ గా ఏర్పడుతుంది. రాయాలన్నా, దేనినైనా పట్టుకోవాలన్నా, తోయాలన్నా షోల్డర్ జాయింట్ చాలా కీలకంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని వీలైనంత కదలికలు ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్టియో ఆర్థరైటిస్, రొటేరర్ కఫ్ ఇంజూరీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, బర్సైటిస్ లోనూ భుజంలో నొప్పి వస్తుంది. నొప్పి చాలా తీవ్రంగా ఉన్నట్లయితే…అది టెండాన్ రప్చర్ కావడం లేదంటే ఫ్రోజన్ షోల్డర్, స్ప్రెయిన్, భుజం స్థాన భ్రంశం చెందడం, బ్రోకెన్ షోల్డర్ వంటి సమస్యల్లో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.

మెడలో సమస్యలు, గ్లెనో హ్యుమరల్ జాయింట్, అక్రోమైయోక్లావిక్యూలర్ జాయింట్, రొటేటర్ కఫ్ కారణంగా షోల్డర్ లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే భుజంలో నొప్పి అనిపించినట్లయితే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా తొందరగా వైద్యులను సంప్రదించడం ఒక్కటే సమస్యకు పరిష్కారం.

 

Exit mobile version