Site icon HashtagU Telugu

Lizard Venom VS Diabetes : షుగర్ ఔషధాలకు విషపూరిత బల్లులతో లింక్.. ఏమిటి ?

Lizard Venom Vs Diabetes Ozempic Diabetes Drug Diabetes Obesity

Lizard Venom VS Diabetes : మనకు డయాబెటిస్ (షుగర్) గురించి బాగా తెలుసు. నిత్యం ఎంతోమంది షుగర్ వ్యాధి బారినపడుతున్నారు.  కానీ చాలామందికి ‘గిలా మాన్‌స్టర్’(Gila monster)  గురించి తెలియదు. గూగుల్‌లో లేదా యూట్యూబ్‌లో ఈ పదం టైప్ చేసి చూడండి మీకే తెలుస్తుంది. దాన్ని చూసి పాము అనుకునేరు. అది బల్లి. పెద్దసైజులో ఉంటుంది అంతే. అమెరికాలోని ఎడారి ప్రాంతాల్లో చాలా అరుదుగా ఈ బల్లులు కనిపిస్తుంటాయి. ‘గిలా మాన్‌స్టర్’ బల్లులు విషపూరితమైనవి. అవి కాటేస్తే మనిషి బతకలేడు. అలాంటి బల్లులకు డయాబెటిస్ వ్యాధితో లింక్ ఉంది. అదేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Shashi Tharoor: శశి థరూర్ ఏం చేయబోతున్నారు ? ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ?

‘గిలా మాన్‌స్టర్’ బల్లుల్లో ఏముంది ? 

  • ‘జీఎల్‌పీ-1’ అనే పదానికి ఫుల్ ఫామ్ ‘గ్లూకాగాన్ లైక్ పెప్టైడ్ 1’. కొన్ని షుగర్ మాత్రలపై  GLP-1 అని రాసి ఉండటాన్ని మనం చూస్తుంటాం.
  • GLP-1 అనేది ఒక హార్మోన్. ఇది మనిషి శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయులను(Lizard Venom VS Diabetes) నియంత్రిస్తుంది. 
  • టైప్-2 షుగర్(డయాబెటిస్), ఒబెసిటీ సమస్యల చికిత్సలో GLP-1తో కూడిన ఔషధాలను వైద్యులు ఇస్తుంటారు.
  • ‘గిలా మాన్‌స్టర్’ బల్లుల విషంలోనూ GLP-1 హార్మోన్ తరహా ప్రొటీన్ ఉంటుందని శాస్త్రవేత్తలు గతంలోనే  గుర్తించారు.
  • కెనడాకు చెందిన ప్రముఖ ఎండో క్రైనాలజిస్ట్ డేనియల్ డ్రక్కర్ షుగర్ ఔషధాలపై బాగా రీసెర్చ్ చేశారు. ఈక్రమంలో గతంలో ఇదే అంశంపై రీసెర్చ్ చేసిన పలువురి అధ్యయన నివేదికలను ఆయన చదివారు.  మనిషి శరీరంలోని జీఎల్‌పీ-1 హార్మోన్ తరహా ప్రొటీన్ ఒకటి ‘గిలా మాన్‌స్టర్’ విషంలో ఉందని అందులో ఉండటాన్ని డ్రక్కర్ గుర్తించారు.  తదుపరిగా గిలా మాన్‌స్టర్ బల్లులపై ఆయన లోతుగా రీసెర్చ్ మొదలుపెట్టారు.

Also Read :Kash Patel Vs Elon Musk : అమెరికా సర్కారులో ‘మస్క్’ దుమారం.. పెదవి విరిచిన కాష్ పటేల్