Paracetamol : పారాసిట్ మాల్ ట్యాబ్లెట్లను అతిగా ఉపయోగిస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?

పారాసిట్ మాల్ టాబ్లెట్స్ (Paracetamol Tablates) ఎక్కువగా వాడడం వలన గుండె ఆగిపోవడం లాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 07:40 PM IST

Risk of Overusing Paracetamol : కరోనా మహమ్మారి తర్వాత పారాసిట్ మాల్ (Paracetamol) టాబ్లెట్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది తలనొప్పిగా అనిపించినా కాస్త జ్వరం వచ్చినా ఒళ్ళు నొప్పులు ఉన్న ఇలా ప్రతి ఒక్కదానికి వైద్యుల సలహా తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఈ పారాసిట్ మాల్ (Paracetamol) టాబ్లెట్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా కాస్త జ్వరం వచ్చింది అంటే చాలు వెంటనే ఈ టాబ్లెట్ ని వేసుకుంటున్నారు. కానీ ఇలా చేయడం అసలు మంచిది కాదు అంటున్నారు వైద్యులు. ఎందుకంటే మీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి కానీ ఈ విధంగా సమస్య తెలియకుండా అలా టాబ్లెట్లను ఉపయోగించడం అస్సలు మంచిది కాదట.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాకుండా ఈ టాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ టాబ్లెట్లను అతిగా ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి తరువాత మెడికల్ షాప్ లో రికార్డు స్థాయిలో అమ్ముడైన టాబ్లెట్స్ ఈ పారాసిట్ మాల్ (Paracetamol). టాబ్లెట్లను ఎక్కువగా ఉపయోగించడం హార్ట్ కి ఏమాత్రం మంచిది కాదు. హార్ట్ ఎటాక్ రావడానికి గల కారణాలలో బీపీ ముఖ్యమైనది అని చెప్పవచ్చు. బీపీ పెరగడానికి కారణం సోడియం అనగా ఉప్పు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఉప్పులో సోడియం మిలితం అయ్యి ఉంటుంది.

సోడియం నిల్వలను పారాసిట్ మాల్ టాబ్లెట్లలో పెంచుతున్నాయి. పారాసిట్ మాల్ టాబ్లెట్లు సోడియం గణనీయమైన మొత్తంలో ఉంటుంది. కాబట్టి అలాంటి టాబ్లెట్లు అతిగా వాడడం వలన సోడియం నిల్వలు పెరిగి హార్ట్ ఎటాక్ లు వస్తాయి. పారాసిట్ మాల్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడడం వలన గుండె ఆగిపోవడం లాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ టాబ్లెట్ లను వైద్యుల సలహా సూచన లేకుండా ఇష్టానుసారంగా వేసుకోవడం వల్ల శరీరంలో సోడియం నిలువలు పెరిగి ప్రాణాంతకంగా మారిపోతున్నాయి. సోడియం నిల్వలు పెరిగితే గుండెకు తీవ్ర నష్టమే జరుగుతుంది. దాంతో గుండెపోటు రావడమే మాత్రమే కాకుండా కార్డియా ఆరెస్టులు సైతం రావచ్చు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాలాలలో సోడియం పెరగడం వలన చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. గుండె రక్తాన్ని తీసుకోవడం పంప్ చేయడంలో చాలా ఇబ్బందులు వస్తాయి. వైద్యులు సలహాలతో ఈ మందులను వేసుకోవాలి లేదంటే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:  Business Ideas: రూ. 5,000 పెట్టుబడితో ప్రారంభించే వ్యాపారాలు ఇవే..!