Site icon HashtagU Telugu

Dry Fruits: ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలో తెలుసా?

Dry Fruits (2)

Dry Fruits (2)

ఆరోగ్యంగా ఉండాలి అంటే పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాల్సిందే. అయితే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదే కానీ ఎలా పడితే అలా తీసుకోకూడదు. ఎందుకంటే వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయట. డ్రై ఫ్రూట్స్ ఒకవేళ తిన్న కూడా మోతాదుకు నుంచి అసలు తీసుకోకూడదని చెబుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే డ్రై ఫ్రూట్స్ ని తీసుకునేవారు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని రాత్రి అంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ని రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బాదం పప్పులను నానబెట్టి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. బాదంని ప్రతిరోజూ రాత్రి పూట నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. మన శరీరం రోగాలకు దూరంగా ఉంటుందని, అలాగే నానబెట్టిన బాదం పప్పులు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు. అదేవిధంగా అంజీర పండ్లలో కూడా మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయట. మీరు రోజూ రాత్రిపూట ఒక డ్రై అంజీర పండును నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందట. అంజీరలో పీచు, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్లు మెండుగా ఉంటాయని,ఇవి మిమ్మల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాగా ఎండు ద్రాక్షలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. వీటిని అలాగే తినకుండా రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీ చర్మం మరింత ఆరోగ్యంగా ఉంటుందట. అలాగే మీ శరీరంలో ఐరన్ లోపం కూడా తొలగిపోతుందని చెబుతున్నారు. అలాగే మీ శరీరంలో ఎనర్జీ లెవెల్స్ కూడా పెరిగిపోతాయట. లీన్ సీడ్స్ కూడా రాత్రంతా నానబెట్టి తింటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. అందుకోసం మీరు ప్రతిరోజూ ఒక టీ స్పూన్ లిన్ సీడ్ ను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తినడం మంచిదని, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని అలాగే డయాబెటిస్ ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. కాగా మెంతులను కూడా నానబెట్టి తినవచ్చట మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అని చెబుతున్నారు. ముఖ్యంగా స్త్రీలకు మెంతి నీరు గొప్ప వరం అని చెబుతున్నారు. మెంతి నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులు సమస్యలు ఉండవట.