Onion Juice : నిత్యం ఉల్లిపాయ రసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు. అంటే దీని అర్థం ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని. ఉల్లిపాయ ఆరోగ్యానికి

  • Written By:
  • Publish Date - January 23, 2024 / 06:00 PM IST

మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు. అంటే దీని అర్థం ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని. ఉల్లిపాయ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఉల్లిపాయ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ హిందూ మేలు చేస్తుంది. ఉల్లిపాయ లేకుండా దాదాపుగా చాలా రకాల వంటలు పూర్తికావు. కొందరు కూరల్లో వేసిన ఉల్లిపాయలు మాత్రమే కాకుండా పచ్చిగా కూడా తింటూ ఉంటారు. కొందరికి చిరుతిళ్లలోనూ ఊల్లిపాయ ముక్కలు ఉండాల్సిందే. అయితే ఉల్లిగడ్డ మాత్రమే కాదు, ఉల్లిపాయ రసంలోనూ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అవును ఎన్నో రకాల సమస్యలను కేవలం ఉల్లి రసంతో చెక్ పెట్టవచ్చు. ఇంతకీ ఉల్లిపాయ రసంతో ఎటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉల్లిగడ్డలో యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వాటినే క్వెర్ సెటిన్ అని పిలుస్తారు. అది మెటబాలిజం రేటును పెంచుతుంది. దాని వల్ల శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు కరుగుతుంది. ఉల్లిగడ్డలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సోడియం కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకే ఉల్లిగడ్డను ఖచ్చితంగా ప్రతి కూరలో వేసుకొని తింటారు. చాలామంది తమ పొట్టను తగ్గించుకోవాలని అనుకుంటారు. పొట్ట బాగా ఎక్కువగా ఉన్నవాళ్లు ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి నిత్యం తీసుకోవాలి.

అలా చేస్తే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. దానికోసం ఉల్లిపాయ రసాన్ని ఎలా తయారు చేయాలంటే, ఉల్లిగడ్డను తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీలో వేసి బాగా మొత్తగా చేసి ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి కలపాలి. దాంట్లో కాసింత తేనె వేసి నిత్యం తాగుతూ ఉండాలి. ఈ పానీయాన్ని ఉదయమే పరగడుపున తాగాలి. దీంతో పొట్ట తగ్గుతుంది. అయితే ఉల్లిపాయ రసం తాగడం వల్ల పొట్ట తగ్గడం మాత్రమే కాకుండా జలుబు ఉన్నా, దగ్గు ఉన్న జ్వరం వచ్చినా కూడా మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు ఎక్కువగా ఉన్నవాళ్లు ఉల్లిరసాన్ని నిత్యం తీసుకోవాలి. ఉల్లిగడ్డ రసాన్ని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బ్లడ్ షుగర్ లేవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఉల్లిపాయ రసంతో తగ్గించవచ్చు. మరి ఇన్ని లాభాలు ఉన్న ఉల్లిపాయను తరచుగా డైట్ లో చేర్చుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు.