Almonds: బాదం పప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. డ్రై ఫ్రూట్స్ లో బాదం కూడా ఒకటి. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ప్రతిరోజు బాదం పప్పును తీసుకోవాలని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే కొందరు బాదంని నేరుగా తింటే మరికొందరు స్వీట్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఇంకొందరు నీటిలో నానబెట్టి తింటూ ఉంటారు. అయితే ఎలా తిన్నా కూడా ఆరోగ్యానికి మంచి జరుగుతుందని కానీ వాటిని తీసుకునే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు.
కాగా ప్రతిరోజు ఉదయం బ్రేకఫాస్ట్‌లో ఒక బాదం తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయట. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని, ఇన్సులిన్ నిరోధకతకు తోడ్పడి బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. తరచుగా బాదం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందట. మీ గుండె ఆరోగ్యం కూడా బాగుంటుందని, వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు బాదం తీసుకోవడం వల్ల బరువు అధికంగా పెరగకుండా ఉంటారని చెబుతున్నారు. బాదం పాలు లేదా నేరుగా కూడా తీసుకోవచ్చట. లేదా నానబెట్టి అయినా తీసుకోవచ్చు అని చెబుతున్నారు.
బాదంపప్పు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రాత్రంతా నానబెట్టిన బాదం పప్పులను ఉదయం పొట్టు తీసి తీసుకోవటం వల్ల ఇన్సూలిన్ నిరోధకతకు తోడ్పడుతుందట. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు కూడా ఇది తినడం మంచిదని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగనివ్వకుండా ఉంటుందట. కడుపునిండిన అనుభూతి కూడా కలిగిస్తుందని చెబుతున్నారు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్లు తక్కువగా తింటారు. వీళ్ళు క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ తినాలట. ప్రతిరోజు ఉదయం నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల కడుపునిండిన అనుభూతి కలుగుతుందట. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఇలా బాదంపప్పు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంచుతుందట. మెగ్నీషియం, ప్రోటీన్, పొటాషియం, అర్జీనైన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఇ కుడా బాదంలో పుష్కలంగా ఉంటుందని, కాబట్టి చర్మం, జుట్టుకు కూడా బాదంపప్పు ఎంతో మంచిదని చెబుతున్నారు. తరచుగా బాదంపప్పు తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ఇందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Almonds: ప్రతీ రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక బాదం తింటే ఏం జరుగుతుందో ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా?

Almond