Omicron New Variant : దేశంలో కొత్త వైరస్ కలకలం..అంటు వ్యాధిగా మారే ప్రమాదం ఉందంటున్న నిపుణులు..!!

దేశంలో ఇప్పుడిప్పుడే కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో మరో పిడుగులాంటి వార్త కలవరం పెడుతోంది.

Published By: HashtagU Telugu Desk
omicron

omicron

దేశంలో ఇప్పుడిప్పుడే కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో మరో పిడుగులాంటి వార్త కలవరం పెడుతోంది. ఓమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ ను కనుగొన్నారు గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు. దీన్ని కొత్త వేరియంట్ BF.7గా మొదటి కేసును గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ తో ప్రజల్లో భయాన్ని సృష్టిస్తోంది. ఇది అంటు వ్యాధిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే తీవ్రత ఎలా ఉంటుంది…ఎలాంటి లక్షణాలతో దాడి చేస్తున్నదానిపై ఇంకా ప్రయోగాలు జరుపుతున్నట్లు సమాచారం.

మీడియా నివేదికల ప్రకారం, ఇటీవల చైనాలో ఇన్ఫెక్షన్ కేసులు పెరగడం వెనుక కొత్త వేరియంట్ BF.7 ప్రధాన పాత్ర ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. Omicron కొత్త వేరియంట్ అత్యంత ప్రభావితంగా అంటువ్యాధిగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది వ్యాప్తి చెందడానికి చాలా ఎక్కువ సంభావ్యతను కలిగి ఉంటుంది . మంగోలియాలో భయంకరమైన రూపాన్ని చూపించిన కొత్త వేరియంట్ చైనాలోనూ తన ప్రతాపం చూపించింది. Omicron ఉప-వేరియంట్‌లు BA.5.1.7 BF.7 చైనాలో ప్రస్తుతం ఈ వేరియంట్లు అంటువ్యాధిగా ప్రభలుతున్నాయి.

దేశంలో నమోదైన మొదటి కేసు దృష్ట్యా, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని..COVID పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు. ఈ సమయంలో గత 24 గంటల్లో 2060 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి . మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 26,834కి పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రస్తుతం దేశంలో కరోనా సంక్రమణ రేటు 0.06 శాతంగా ఉంది. అదే సమయంలో, రోజువారీ ఇన్ఫెక్షన్ రేటు 1.86 శాతం, వారానికి సంక్రమణ రేటు 1.02 శాతంగా ఉంది.

  Last Updated: 17 Oct 2022, 06:33 PM IST