ఉదయాన్నే లేవగానే నోటిని ఆయిల్‌తో పుక్కిలించడం (Oil Pulling) చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Dental Health) కలుగుతాయి. ఇది ప్రాచీన ఆయుర్వేద పద్ధతులలో ఒకటి. నోటిలో నూనెను 15 నుంచి 20 నిమిషాలపాటు ఉంచి పుక్కిలించడంతో దంతాలు శుభ్రపడటమే కాకుండా, దంతాల బలం పెరుగుతుంది. అలాగే, నోటి దుర్వాసన కూడా పూర్తిగా తగ్గిపోతుంది.
ఈ ప్రక్రియ ద్వారా నోటిలోని బ్యాక్టీరియాలు, టాక్సిన్లు బయటికి పంపబడతాయి. నూనె పుక్కిలించేటప్పుడు నోటిలో ఉన్న చీపురు లాంటి భాగాలలోనూ, దంతాల మధ్య ఉన్న అవాంఛిత పదార్థాలు బయటికి వచ్చేస్తాయి. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని మొత్తం టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణులు దీన్ని రోజువారీ అలవాటుగా మార్చాలని సూచిస్తున్నారు.
MI vs SRH: వాంఖడే స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీని చిత్తు చేసిన ముంబై!
ఆయిల్ పుల్లింగ్ కోసం సాధారణంగా కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా సన్ ఫ్లవర్ నూనె వాడవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. కొంతమంది ఓ పళ్ళు బ్రష్ చేయడానికి ముందు ఇది చేస్తే ఇంకా మంచి ఫలితాలు అందుతాయని చెబుతున్నారు. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఇది రక్తప్రసరణను పెంపొందించే శక్తి కలిగి ఉంది. ఈ ప్రక్రియను నిత్యం పాటించడంతో శరీరం ఆరోగ్యంగా, శుద్ధిగా ఉండటమే కాకుండా, మనిషి ఉత్సాహంగా, శక్తివంతంగా మారుతాడు. సో మీరు కూడా ఇలా చెయ్యండి.