Tips To Relive Period Cramps: నెలసరి సమయంలో నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇది తాగాల్సిందే?

స్త్రీలకు ప్రతినెల నెలసరి రావడం అన్నది సహజం. అయితే కొందరు స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు కడుపునొప్పి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. కొం

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 09:30 PM IST

స్త్రీలకు ప్రతినెల నెలసరి రావడం అన్నది సహజం. అయితే కొందరు స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు కడుపునొప్పి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు ఈ నొప్పికి తట్టుకోలేక టాబ్లెట్స్ కూడా మింగుతూ ఉంటారు.. నెలసరి సమయంలో వచ్చే.. కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, అధిక రక్త స్రావం, వాంతులు, కళ్లు తిరగడం, నీరసం, చికాకు, తిమ్మిర్లు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎక్కువమంది మహిళలకు కడుపు నొప్పి, నడుము నొప్పి, పొత్తికడుపు నొప్పి వేధిస్తూ ఉంటాయి. కొందిమందికి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కనీసం నిలబడి నడవలేని స్థితిలో ఉంటారు. పీరియడ్స్‌‌‌ సమస్యల కారణంగా వ్యక్తిగత జీవతంలో, ఆఫీస్‌ పనులపై ధ్యాస పెట్టలేరు. కొందరు ఈ బాధను భరించలేక పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుంటూ ఉంటారు.

అయితే మెడిసిన్స్ వాడడానికి బదులుగా కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.సాధారణంగా మహిళలకు పీరియడ్స్ వచ్చిన సమయంలో రక్తస్రావం అవుతుందన్న విషయం తెలిసిందే. గర్భాశయం లోపలి గోడలని కప్పుతూ ఉండే మృదువైన ఎండోమెట్రియమ్ అనే పొర ప్రతి నెలా బాగా ఎదిగి, మందంగా తయారై, అధిక రక్త ప్రసరణతో గర్భధారణకు సంసిద్ధంగా ఉంటుంది. నెలమధ్యలో విడుదలయ్యే అండం, వీర్యకణంతో కలసి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడితే ఈ ఎండోమెట్రియమ్ పొర ఆ పిండానికి కావలసిన రక్తసరఫరాను, పోషకాలను అందిస్తూ అది గర్భాశయంలో అతుక్కుని ఎదగడానికి తోడ్పడుతుంది.

గర్భధారణ జరగని పరిస్థితులలో ఈ ఎండోమెట్రియమ్ పొర ప్రతి నెలా బ్లీడింగ్‌ రూపంలో బయటకు వస్తుంది. పీరియడ్స్‌ సమయంలో గర్భశయం సంకోచించడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా గర్భాశయం లైనింగ్‌లో ఉన్న రక్త ధమనులు మూసుకుపోతాయి. రక్తం, ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోతుంది. ఈ సమయంలో కణాలు నొప్పి కలిగించే రసాయనాలు విడుదల చేస్తాయి. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడానికీ ఇంట్లో సులభంగా దొరికే వస్తువులను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకోవాలి. ఇది తాగిన కొన్ని నిమిషాల్లోనే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

నెలసరి సమయంలో రోజుకు రెండు సార్లు ఈ టిప్‌ ఫాలో అయితే కడుపు నొప్పి, తిమ్మిర్లు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం అవుతాయి. అలాగే పీరియడ్స్‌ సమయంలో ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాసెస్‌ చేసిన ఆహారం, వేపుళ్లు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, నూనెలో వేయించిన ఆహారం, మసాలా, కాఫీ, టీలకు దూరంగా ఉండటం మంచిది. నెలసరి సమయంలో తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు డైట్‌లో చేర్చుకోవడం ఆ నెలసరి సమస్యల నుంచి బయట పడవచ్చు. తేలికపాటి వ్యాయామం, మంచి నిద్ర మీరు పీరయడ్స్‌ సమయంలో హ్యాపీగా ఉండటానికి సహాయపడతాయి.