Site icon HashtagU Telugu

Monsoon Season: వర్షాకాలంలో మొటిమలు రాకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే!

Monsoon Season

Monsoon Season

వర్షాకాలంలో చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిలో మొటిమల సమస్య కూడా ఒకటి. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్ ల కారణం కూడా ఒకటి. చాలామందికి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ కారణంగా వర్షాకాలంలో మొటిమలు వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో గాలిలో ఎక్కువగా ఉండే తేమ కూడా బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. అయితే చర్మ సంరక్షణతో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. చర్మ ఆరోగ్యం విషయానికొస్తే.. జింక్ ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే నూనె ఉత్పత్తిని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.

దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది మొటిమల వల్ల కలిగే ఎరుపు, చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాక జింక్ గాయాలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది మొటిమల వల్ల దెబ్బతిన్న చర్మాన్ని మరమ్మత్తు చేయడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. గుమ్మడికాయ విత్తనాలు, చిక్పీస్, కాయ ధాన్యాలు, కాయలు, తృణ ధాన్యాలు, పాల ఉత్పత్తుల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ ను తగినంత తీసుకోవడం వల్ల మీ చర్మం అందంగా, మచ్చలు లేకుండా ఉంటుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శక్తివంతమైన శోథ నిరోధక ఏజెంట్లు.

ఇవి చర్మ చికాకును, ఎరుపును తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఇవి సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అయితే సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అయితే రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది మొటిమలు అయ్యేలా చేస్తుంది. అయితే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చర్మ రంద్రాలను క్లియర్ చేస్తుంది. మొటిమలు ఏర్పడకుండా కాపాడుతుంది. సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. శాకాహారులు అవిసె గింజలు, చియా విత్తనాలు, వాల్ నట్స్ ను తినొచ్చు. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు.