Site icon HashtagU Telugu

NTR Trust : హెల్త్ టిప్స్ అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్

Health Tips

Health Tips

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేదలకు సహాయం చేయడం, ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని విద్యార్థులకు విద్యా సహాయం అందించడం, మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం వంటి కార్యకలాపాలతో ట్రస్ట్ సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారు.

విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నిరుపేద పిల్లల కోసం ప్రత్యేక విద్యాసంస్థలు నిర్వహించడం, వివిధ హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయడం ద్వారా అనేక మందికి మేలు చేస్తోంది. అలాగే, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు శిక్షణా కార్యక్రమాలు అందిస్తోంది. ఇటీవల, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏ విధమైన ఆహారం తీసుకోవాలో వివరిస్తూ, ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు అందించింది.

 

 

బలహీనంగా ఉన్నవారు, హైబీపీ బాధితులు, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునేవారు, రక్తహీనత సమస్య ఎదుర్కొనే వారు ఏం తినాలి? బరువు తగ్గడానికి సరైన ఆహారం ఏమిటి? గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వంటి అంశాలను వివరిస్తూ ట్రస్ట్ ప్రజలకు ఉపయోగకరమైన సమాచారం అందించింది. ఈ ఆరోగ్య సూచనలు ప్రజలకు అవగాహన పెంచేలా, ఆరోగ్యంగా జీవించేందుకు దోహదపడేలా ఉన్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ విధంగా విద్య, వైద్యం, మహిళా సాధికారత, ఆరోగ్యంపై తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, మరెంతో మందికి మేలు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.