Ozempic: ఓజెంపిక్ అంటే ఏమిటి? భార‌త్‌లో దీని ధ‌ర ఎంతంటే?!

వేగంగా బరువు తగ్గడానికి వీలుగా ఓజెంపిక్ ఇంజెక్షన్‌ను వారానికి ఒకసారి తీసుకుంటారు. భారతదేశంలో 0.25 mg ఓజెంపిక్ డోస్ ధర రూ. 2,200గా నిర్ణయించారు.

Published By: HashtagU Telugu Desk
Ozempic

Ozempic

Ozempic: డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నోర్డిస్క్ చివరకు భారతదేశంలో ఓజెంపిక్ (Ozempic)ను విడుదల చేసింది. ఇది మధుమేహం (డయాబెటిస్) చికిత్సలో ఉపయోగపడే ఔషధం. ఇది విదేశాలలో చాలా కాలంగా ఉపయోగంలో ఉంది. సెలబ్రిటీల మధ్య బరువు తగ్గడం (Weight Loss) కోసం కూడా దీని వినియోగం పెరిగింది. వేగంగా బరువు తగ్గడానికి వీలుగా ఓజెంపిక్ ఇంజెక్షన్‌ను వారానికి ఒకసారి తీసుకుంటారు. భారతదేశంలో 0.25 mg ఓజెంపిక్ డోస్ ధర రూ. 2,200గా నిర్ణయించారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఓజెంపిక్ డోస్ 0.25 mg, 0.5 mg, 1mg మోతాదులలో అందుబాటులో ఉంటుంది. ఓజెంపిక్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఓజెంపిక్ అంటే ఏమిటి?

ఓజెంపిక్ అనేది టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం ఉపయోగించే ఒక ఔషధం. పెద్దలలో టైప్ 2 డయాబెటిస్‌లో ఉపయోగించే ఉద్దేశంతో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ ఏడాది అక్టోబర్‌లో దీనికి ఆమోదం తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ FDA ప్రకారం.. ఓజెంపిక్‌ను సరైన ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకుంటే ఇది గ్లైసెమిక్ నియంత్రణలో సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

Also Read: Farmhouse Party : దువ్వాడ దంపతులు చెప్పేది నిజమేనా..? అసలు ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది..?

పనిచేసే విధానం

ఓజెంపిక్ ఇంజెక్షన్ ఆకలిని తగ్గిస్తుంది. ఇది సహజ హార్మోన్ GLP-1 లాగా పనిచేస్తుంది. దీని కారణంగా ప్రజలు దీనిని బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఓజెంపిక్ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఓజెంపిక్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆహారం కడుపులో ఎక్కువసేపు నిలిచి ఉంటుంది.దీనివల్ల తరచుగా ఆకలి అనిపించదు. దీనిని అధిక మోతాదులో తీసుకుంటే వ్యక్తికి ఆకలి అనుభూతి లేకుండా పోయి, త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఓజెంపిక్ తీసుకుంటే కలిగే ప్రమాదాలు ఏమిటి?

  • ఓజెంపిక్ తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్‌లో వాపు రావచ్చు.
  • ఇది పిత్తాశయ సమస్యలను పెంచవచ్చు.
  • FDA ప్రకారం.. ఓజెంపిక్ ఇంజెక్షన్ తీసుకోవడం వలన వాంతులు, అతిసారం (డయేరియా), కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు కలగవచ్చు.

ఓజెంపిక్ ఒక నెలపాటు తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది?

  • భారతదేశంలో 0.25 mg ఓజెంపిక్ ఒక డోస్ రూ. 2,200 ధరలో లభిస్తుంది. దీనిని వారానికి ఒకసారి తీసుకోవాలి.
  • ఒకవేళ ఓజెంపిక్ 1 mg డోస్ తీసుకుంటుంటే, నెలవారీ ఖర్చు రూ. 11,175 అవుతుంది.
  • అదనంగా, 0.5 mg డోస్ ఖర్చు నెలకు రూ. 10,170, 0.25 mg డోస్ ఖర్చు నెలకు రూ. 8,800 అవుతుంది.
  Last Updated: 13 Dec 2025, 10:46 AM IST