Medicines With Blood : గాయాలు త్వరగా మానిపోయేలా చేసే.. ఎముకలు త్వరగా అత్తుకుపోయేలా చేసే సరికొత్త పదార్థం రెడీ అయింది. దీన్ని ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ యూనివర్సిటీకి చెందిన ఫార్మసీ అండ్ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం పరిశోధకులు తయారు చేశారు. కృత్రిమంగా రూపొందించే సింథటిక్ పెప్టైడ్స్‌ను మానవ రక్తంతో కలిపి ఈ మెటీరియల్‌ను(Medicines With Blood) తయారు చేశామని సైంటిస్టులు వెల్లడించారు.
Also Read :Tiger Fear : ఆదిలాబాద్ ఏజెన్సీ గ్రామాల్లో పులి దడ.. ఎట్టకేలకు ‘కవ్వాల్’లోకి టైగర్
మన శరీరానికి, శరీర భాగాలకు ఏవైనా గాయాలు అయితే.. అవి మానేలా చేయడంలో రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. ఈక్రమంలో రక్తంలోని హెమటోమా అనే పదార్థం కీలక పాత్ర పోషిస్తుంది. హెమటోమా అనేది శరీర కణజాలాల పునరుత్పత్తికి దోహదం చేస్తుంది. శరీర కణజాలాల రిపేరింగ్‌లోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే సింథటిక్ పెప్టైడ్స్‌ను మానవ రక్తంతో కలిపి ఓ బయోకోపరేటివ్ పదార్థాన్ని నాటింగ్‌హామ్ వర్సిటీ సైంటిస్టులు తయారు చేశారు. గాయపడిన మానవ శరీర అణువులు, కణాలు, కణజాలాల్లో సహజంగా మరమ్మతులు జరిగేలా ప్రేరణ కల్పించడానికి ఈ మెటీరియల్ దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Also Read :North Korea : దక్షిణ కొరియాపైకి ఉత్తర కొరియా ‘సౌండ్ బాంబ్’.. ఏమైందంటే ?
జంతువుల రక్తంతో సింథటిక్ పెప్టైడ్స్‌ను కలిపి తయారు చేసిన మెటీరియల్ కూడా బాగా పనిచేసిందని, గాయాలు వేగంగా మానిపోయేలా చేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. జంతువుల ఎముకలు విరిగిన సందర్భాల్లో.. ఈ మెటీరియల్ ద్వారా చికిత్స చేస్తే అవి వేగంగా అత్తుకుపోయాయని వివరించారు. అత్యవసర వైద్య చికిత్సలలో ఉపయోగపడేలా ఈ మెటీరియల్‌తో ఒక టూల్ కిట్‌ను తయారు చేయడమే తమ లక్ష్యమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మొత్తం మీద ఈ ఆవిష్కరణ వైద్య చికిత్సా రంగంలో మరో విప్లవాన్ని క్రియేట్ చేసేలా అద్భుతంగా ఉంది.