Site icon HashtagU Telugu

Weight loss: తొందరగా బరువు తగ్గాలి అంటే ఈ ఐదు రకాల జ్యూస్ లను తీసుకోవాల్సిందే?

Mixcollage 04 Dec 2023 02 54 Pm 3821

Mixcollage 04 Dec 2023 02 54 Pm 3821

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ అధిక బరువు సమస్య కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు అయితే స్వతహాగా వారి పనులు వారు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే నలుగురిలోకి వెళ్ళాలి అన్నా కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ వస్తాయని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక అధిక బరువు సమస్యను తగ్గించుకోవడం కోసం చాలామంది ఎన్నో రకాల వ్యాయామాలు ఎక్సర్సైజ్ డైట్లు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించకపోవడంతో దిగులు చెందుతూ ఉంటారు.

అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఐదు రకాల జ్యూసులు తాగితే మాత్రం బరువు తగ్గడం ఖాయం అంటున్నారు వైద్యులు.. మరి ఇటువంటి జ్యూసులు తాగితే తొందరగా బరువు తగ్గుతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ కి బదులుగా గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. ఈ గోధుమ గడ్డిని ఇంట్లోనే ఈజీగా తయారు పెంచుకోవచ్చు. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటికి వెళ్లిపోయి త్వరగా సన్నగా అవుతారు. కరివేపాకు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కరివేపాకు కూరల్లో కాకుండా డైరెక్ట్ గా జ్యూస్ చేసుకొని తాగితే తొందరగా సన్నబడతారు. దీనికోసం గుప్పెడు కరివేపాకు గ్లాస్ నీళ్ళల్లో వేసి మరిగించుకోవాలి.

దీనిలో ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ నిమ్మరసం వేసి కలిపి త్రాగాలి. కరివేపాకులో ఉండే అమైనో ఆమ్లాలు పొట్టలోని కొవ్వును కరిగించడానికి ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి ఈ జ్యూస్ చాలా మంచిది. రోజు ఉదయాన్నే టిఫిన్ సమయంలో ఒక బీట్రూట్ రెండు క్యారెట్లు కలిపి జ్యూస్ లా తయారు చేసుకుని తీసుకోవాలి. దీనిలో ఉండే ఫైబర్ విటమిన్ ఏ,సి అధిక బరువును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో తినాలనే కోరిక తగ్గి త్వరగా సన్నబడతారు. నిత్యం ఉదయాన్నే పుచ్చకాయ జ్యూస్ ను తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే నిత్యం ఉదయం టిఫిన్ కి బదులుగా బొప్పాయి జ్యూస్ తాగడం వలన అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్ పొట్టలు కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది.