Good Food: మధుమేహన్ని నియంత్రించే ప్రీబయాటిక్స్

మన శరీరంలో జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయాలి అంటే శరీరానికి తగినన్ని విటమిన్లు, ప్రోటీన్లు అందాలి. అయితే ఈ

Published By: HashtagU Telugu Desk
Prebiotics

Prebiotics

మన శరీరంలో జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయాలి అంటే శరీరానికి తగినన్ని విటమిన్లు, ప్రోటీన్లు అందాలి. అయితే ఈ ప్రోటీన్లు విటమిన్లు శరీరానికి అందడానికి పలు రకాల బ్యాక్టీరియాలు కూడా సహాయపడుతూ ఉంటాయి. అవి పెరుగు వంటి ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అందుతూ ఉంటాయి. అయితే శరీరానికి కేవలం ప్రో బయోటిక్స్ మాత్రమే కాకుండా ప్రీ బయాటిక్స్ అందడం వల్ల కూడా శరీరం ఆరోగ్యవంతంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఐతే ప్రీ బయాటిక్స్  అనేవి మరొక రకమైన బ్యాక్టీరియా కాదు.

మన శరీరంలో జీర్ణవ్యవస్థలో ప్రో బయాటిక్స్  ఎదగడానికి తగిన స్థాయిలో ఉండేందుకు తోడ్పడే ఆహార పదార్థాలు యాపిల్స్, అరటి పండ్లు, ఓట్స్, ఉల్లిపాయలు, లీక్స్, వెల్లుల్లి, అల్లం వంటి వాటితో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ప్రీ బయాటిక్స్ గా పనిచేస్తాయి. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడంతో పాటు, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు కూడా తలెత్తకుండా తోడ్పడుతూ ఉంటాయి. కాగా ఈ ప్రీ బయాటిక్స్ మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి అని పరిశోధనలో తేలినట్లు నిపుణులు చెబుతున్నారు.

మన పేగుల్లో ఉండే ప్రో బయాటిక్ బ్యాక్టీరియాలు ఎదగడం కోసం ఈ తరహా ఆహార పదార్థాలు తోడ్పడతాయని, ఆరోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉంచుతాయని వాళ్ళు తెలిపారు. అలాగే పేగుల్లో ఉండే వేల రకాల బ్యాక్టీరియాలు బాగుపడాలి అంటే వివిధ రకాల ప్రీ బయాటిక్స్ తీసుకోవడం వల్ల మైక్రొబియం సరిగా ఎదుగుతుంది అని నిపుణులు తెలిపారు. అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికీ ప్రీ బయాటిక్స్ ఎంతో ఉపశమనం అందిస్తాయి. అలాగే అధిక బరువు ఉండి తగ్గాలి అనుకున్న వారికి కూడా ఈ ప్రీ బయాటిక్స్ బాగా ఉపయోగపడతాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి రక్తంలో చక్కెర నియంత్రించడం కోసం ఈ ప్రీ బయాటిక్స్ తోడ్పడతాయి. ఈ ప్రీ బయాటిక్స్ లోని పోషకాలు గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్, ఊబకాయంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు తోడ్పడతాయి.

  Last Updated: 19 Jul 2022, 01:49 PM IST