Remedies for nosebleeds : వేసవిలో ముక్కు నుంచి రక్తస్రావం అవుతోందా?ఈ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.

  • Written By:
  • Updated On - April 25, 2023 / 11:08 PM IST

చాలామందికి వేసవిలో ముక్కు నుండి రక్తస్రావం (Remedies for nosebleeds సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది 3 నుండి 10 సంవత్సరాల పిల్లలలో సాధారణంగా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ పెద్దలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. దీనికి అనేక సమస్యలు కారణం కావచ్చు, కానీ ప్రధాన కారణం శరీర ఉష్ణోగ్రత పెరగడం. అంతే కాకుండా వేడి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు నుంచి రక్తం కారుతుంది.

ముక్కు నుండి రక్తస్రావం అంటే వైద్య భాషలో ఎపిస్టాక్సిస్. ముక్కుకు సమీపంలో రక్త సరఫరా ఎక్కువగా ఉండే స్థలం ఉంది. ఈ భాగంలో గాయం అయినప్పుడు లేదా రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు, రక్త నాళాలు తెరుచుకోవడం వల్ల రక్తం ప్రవహించడం ప్రారంభమవుతుంది. సుదీర్ఘ జలుబు కారణంగా, ముక్కు రక్తస్రావం సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ముక్కు నుండి రక్తస్రావం కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. అత్యంత సాధారణ కారణం వాతావరణంలో మార్పు. ఇది కాకుండా, ముక్కులో అలెర్జీలు, ఏదైనా అంతర్గత సిర లేదా రక్త నాళాలు దెబ్బతినడం, అధిక వేడి, శరీరంలో పోషకాల కొరత, సైనస్, రక్తపోటు, అధిక తుమ్ములు, జలుబు లేదా ముక్కును ఎక్కువగా రుద్దడం వంటివి కూడా ముక్కును రక్తస్రావం అయ్యేలా ప్రేరేపిస్తాయి.

ముక్కు నుండి రక్తస్రావం తగ్గడానికి ఈ ఇంటి నివారణలను అనుసరించండి:

– ముక్కునుంచి రక్తస్రావం అవుతుంటే తక్షణ ఉపశమనం పొందడానికి కోల్డ్ కంప్రెస్ అత్యంత ప్రభావవంతమైన మార్గం.

-ఐస్ ముక్కను టవల్లో చుట్టు ముక్కుపై ఉంచండి.

– మధ్యలో టవల్‌తో ముక్కును తేలికగా నొక్కుతూ ఉండండి.

-ఇలా 4-5 నిమిషాల పాటు చేయాలి.

-ఐస్ చల్లదనం వల్ల రక్తస్రావం తగ్గిస్తుంది. దీని వల్ల రక్తస్రావం ఆగిపోతుంది. ముక్కుపై నేరుగా ఐస్ పెట్టకూడదని గుర్తుంచుకోండి.