Traffic Noise Vs Heart Attack : ట్రాఫిక్‌లో ఎక్కువ గడిపితే..ఐదేళ్లలో గుండెపోటు?

Traffic Noise Vs Heart Attack : ట్రాఫిక్ లో ఎక్కువ టైం గడిపే వారికి అలర్ట్.. ట్రాఫిక్ సౌండ్స్ ను అతిగా వింటే  5 ఏళ్లలో గుండెపోటు వచ్చే ముప్పు ఉంటుందట. 

  • Written By:
  • Updated On - June 14, 2023 / 12:10 PM IST

Traffic Noise Vs Heart Attack : ట్రాఫిక్ లో ఎక్కువ టైం గడిపే వారికి అలర్ట్.. 

ట్రాఫిక్ సౌండ్స్ ను అతిగా వింటే  5 ఏళ్లలో గుండెపోటు వచ్చే ముప్పు ఉంటుందట. 

అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌ స్టడీలో ఈవిషయం వెల్లడైంది. 

స్టడీ రిపోర్ట్ ప్రకారం.. 53 డెసిబుల్స్ కంటే ఎక్కువ ట్రాఫిక్ శబ్దం మనుషులను అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ పెద్ద శబ్దాలు మన నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మన గుండె వేగాన్ని, బీపీని పెంచుతాయి. వెరసి.. ఐదేళ్లలో గుండెపోటు గండం చుట్టుముట్టే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు హెచ్చరించారు.  శబ్ద కాలుష్యం వల్ల స్ట్రెస్ హార్మోన్లు  అడ్రినలిన్, కార్టిజాల్ మన శరీరంలో రిలీజ్ అవుతాయి. సౌండ్ పొల్యూషన్ ఎఫెక్ట్ తో ధమనులు కూడా గట్టిపడుతున్నాయని, టాన్జిల్స్ లో వాపు వస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరగడానికి కూడా ట్రాఫిక్ సౌండ్స్(Traffic Noise Vs Heart Attack) కారణమవుతున్నాయని పేర్కొన్నారు.

Also read : Monday Heart Attack: సోమవారంలోనే అధిక గుండెపోటు ప్రమాదాలు

ట్రాఫిక్ శబ్దం 53 dB మించితే.. 

ధ్వనిని డెసిబుల్స్(dB)లో కొలుస్తారు. పటాకులు పేల్చినప్పుడు వచ్చే సౌండ్ దాదాపు 140 dB ఉంటుంది. సౌండ్ 10 dB పెరిగే కొద్దీ మన చెవిపై దాని నెగెటివ్  ఎఫెక్ట్  పెరిగిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. రోడ్డుపై వాహన ట్రాఫిక్ శబ్దం 53 dB కంటే ఎక్కువ ఉంటే మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. మహా నగరాల్లోని చాలా మెయిన్ రోడ్ ఏరియాలు సగటున 45 dB శబ్ద కాలుష్యం కలిగి ఉన్నవేనని నివేదిక పేర్కొంది. 35 dBకి మించిన సౌండ్స్.. హృదయ సంబంధ వ్యాధుల ముప్పును సృష్టించే ఛాన్స్ ఉందని తెలిపింది.