No Tax On Covid Treatment: కరోనా చికిత్సకు.. పన్ను మినహాయింపు.. పూర్తి వివరాలు మీ కోసం!

దేశవ్యాప్తంగా కరోనా మరొకసారి విజృంభిస్తోంది. రోజురోజుకీ చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 02:31 PM IST

దేశవ్యాప్తంగా కరోనా మరొకసారి విజృంభిస్తోంది. రోజురోజుకీ చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుంది అనుకుంటున్న నేపథ్యంలో మరొకసారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది కరోనా మహమ్మారి. అయితే ఈ కరోనా మహమ్మారి బారిన పడిన ఉద్యోగులకు లేదంటే వారి కుటుంబ సభ్యుల చికిత్సకు కొన్ని కంపెనీలు ఆర్థికంగా సహాయం చేశాయి. అంతేకాకుండా మరికొన్ని సందర్భాలలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా పరిహారాన్ని అందజేశాయి. అయితే ఒకేలా ఉద్యోగస్తులు కాకపోతే బంధువులు లేదా తెలిసిన వ్యక్తులు సన్నిహితుల ద్వారా సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ విధంగా అందిన మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిని క్లైమ్ చేసుకోవడానికి కావలసిన పత్రాలు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇటీవల విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఈ వెసులుబాటును గత ఏడాది 2021 జూన్‌ 25 లోనే ప్రకటించి బడ్జెట్‌ 2022లో దీన్ని నోటి ఫై కూడా చేసింది. కాగా 2019, 2020 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని వర్తింపజేస్తామని తాజా ఉత్తర్వుల్లో సీబీడీటీ తెలిపింది. అయితే పన్ను మినహాయింపు కోరే ఉద్యోగులు ముందుగా కంపెనీలకు ఈ కింది పత్రాలను సమర్పించాలని సీబీడీటీ తాజా నివేదికలో తెలిపింది.

ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ధ్రువీకరించిన మెడికల్‌ సర్టిఫికెట్‌. అలాగే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత ఆరు నెలలోపు దానికి సంబంధించి తీసుకున్న చికిత్స, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు చెందిన అన్ని మెడికల్ సర్టిఫికెట్స్ అలాగే కోవిడ్ 19 సంబంధిత చికిత్సకు అయిన ఖర్చును ధ్రువీకరించే పత్రం వీటన్నింటినీ కూడా కంపెనీలో సమర్పించడంతో పాటు వ్యక్తిగతంగానూ ఓ కాపీని దగ్గర భద్రపరచుకోవాలని సీబీడీటీ తెలిపింది. మరోవైపు ఫారం 1ని ఆదాయపు పన్ను విభాగానికి ఇవ్వాలని సీబీడీటీ స్పష్టం చేసింది.

డబ్బు చేతికి అందిన తొమ్మిది నెలల లోపుగానీ లేదా 2022 డిసెంబరు 31 వరకు గానీ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించింది. అయితే ఫారం-1 ప్రకారం ఉద్యోగులు ఆదాయపు పన్ను విభాగానికి కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. పేరు, చిరునామా, పాన్‌,తేదీ, సీరియల్‌ నెం/ఐడీ నెంబరుతో కూడిన కోవిడ్ 19 పాజిటివ్‌ నిర్ధారణ పరీక్షల వివరాలు ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయిన ఆరు నెలల్లోపు అందిన చికిత్సకు సంబంధించిన వివరాలు, అలాగే సరైన పత్రాలతో కూడిన వైద్య ఖర్చు వివరాలు చికిత్సకు అందిన నగదు మొత్తం సాయం అందించిన వ్యక్తి పేరు, చిరునామా, పాన్‌ వివరాలు సబ్మిట్ చేయాలట.