Weight Loss: త్వరగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినాల్సిందే?

మామూలుగా బరువు పెరగడం చాలా ఈజీ కానీ బరువు తగ్గడం అన్నది ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పవచ్చు. బరువు తగ్గడం కోసం డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 10:00 PM IST

మామూలుగా బరువు పెరగడం చాలా ఈజీ కానీ బరువు తగ్గడం అన్నది ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పవచ్చు. బరువు తగ్గడం కోసం డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు రకరకాల ఎక్సర్ సైజ్ లు, వర్క్ ఔట్స్ చేస్తూ హోమ్ రెమెడీస్ ను కూడా ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది త్వరగా బరువు తగ్గాలి అని ఏవేవో చిట్కాలను పాటిస్తూ ఉంటారు. మరి త్వరగా బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం జరుపుకుందాం.. ఆపిల్ ఓట్స్.. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇందుకోసం ఒక జార్ తీసుకుని అరకప్పు ఓట్స్, అరకప్పు నాన్ ఫ్యాట్ మిల్క్, పావు కప్పు సాదా నాన్ ఫ్యాట్ పెరుగు వేయాలి. ఒక పెద్ద యాపిల్‌ని చిన్నగా, సగం కోయాలి.

ఇప్పుడు అందులో మీకు ఇష్టమైన డ్రైఫ్రూట్స్ తరుగు కూడా వేయవచ్చు. చిటికెడు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ చియా గింజలు చల్లి కొంచెం తేనె వేసుకోవాలి. రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి, ఉదయమే తినవచ్చు. అలాగే మీ రోజువారి ఆహారంలో సలాడ్ చేర్చడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. మన ఇళ్ళల్లో ఈ రుచికరమైన సలాడ్ కోసం ఒక తరిగిన ఉల్లిపాయ, దోసకాయ, రెండు టమాటలు అవసరం. ఈ మూడింటిని కలిపి, అరకప్పు తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి తినాలి. అలాగే ఒక గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయండి. ఇందులో దోసకాయ తరుగు కొద్దిగా, తరిగిన టమాట, తరిగిన క్యాప్సికమ్, ఉల్లిపాయ తరుగు వేయాలి.

ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ఎర్ర కారం పొడి, అర టీ స్పూన్ చాట్ మసాలా, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. టోస్ట్ చేసిన బ్రెడ్‌పై ఇది వేయండి. ఈ బ్రెడ్ వీట్, మల్టీ గ్రెయిన్ అయితే మరీ మంచిది. మరో బ్రెడ్‌తో శాండ్విచ్ తయారు చేసి తినవచ్చు. ఓ పెద్ద గిన్నె తీసుకుని అందులో 60 గ్రాముల చియా గింజలు, 400 మిల్లీ లీటర్ల తియ్యని బాదం పాలు, హాజెల్ నట్ పాలు కలపండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కోకోపౌడర్, 2 టేబుల్ స్పూన్ల మాపుల్ సిరప్, అర స్పూన్ వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ వేయండి. బాగా కలిపి కొద్దిగా ఉప్పు వేయండి. ఏదైనా మూత పెట్టి ఫ్రిజ్‌లో కనీసం 4 గంటలు ఉంచండి. రాత్రంతా ఉంచితే చిక్కబడి బావుంటుంది. ఇక దీనిని ఆరగించవచ్చు.