Site icon HashtagU Telugu

Sweat: చలికాలంలో రాత్రిపూట చెమట ఎక్కువగా పడుతోందా.. అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే!

Sweat

Sweat

మామూలుగా ప్రతి ఒక్క మనిషికి టెన్షన్ పడినప్పుడు అలాగే పని చేస్తున్నప్పుడు శరీరం నుంచి చెమట రావడం అన్నది సహజం. ఇంకా చాలా రకాల సందర్భాలలో చెమట వస్తూ ఉంటుంది. అయితే ఇతర సీజన్లతో పోల్చుకుంటే చలికాలంలో వచ్చే మాట చాలా తక్కువగా పడుతూ ఉంటుంది. ఎక్కువగా కష్టపడే వారికి మాత్రమే చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువసేపు ఉండదు. కొంతమందికి నిద్రలో ఉన్నప్పుడు కూడా చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఇలా రావడం అసలు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మరి చలికాలంలో రాత్రిపూట ఎక్కువగా చెమట పడితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలిలో కూడా రాత్రి చెమటలు పట్టడం వెనుక అనేక కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అత్యంత సాధారణ కారణాలు హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెక్షన్ లేదా చాలా వెచ్చని బట్టలు ధరించడం కానీ ఈ సమస్య నిరంతరం కొనసాగితే, ఇది కొన్ని తీవ్రమైన వ్యాధుల లక్షణం కావచ్చట. టీబీ ప్రారంభ లక్షణాలు రాత్రిపూట చెమటలు పట్టడం. ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. సమయానికి చికిత్స చేయకపోతే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

థైరాయిడ్ గ్రంధి అతిగా పనిచేసినప్పుడు కూడా రాత్రిపూట చెమటలు ఎక్కువగా పడతాయట. ఈ పరిస్థితి హృదయ స్పందన రేటును పెంచుతుందని, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. మహిళల్లో రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పులు చలిలో కూడా చెమటలు పట్టేలా చేస్తాయట. రాత్రిపూట చెమటలు ఎక్కువగా పట్టడం అన్నది గుండెపోటు సమస్యలకు సంకేతంగా భావించాలని చెబుతున్నారు. ఇలాంటప్పుడు పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదట. మీరు చలి సమయంలో రాత్రిపూట పదేపదే చెమటలు పడుతూ ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయవద్దని వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.

Exit mobile version