Site icon HashtagU Telugu

Snoring Accelerates Aging: గురక ఎక్కువగా పెడితే ముసలితనం వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Snoring Accelerates Aging

Snoring Accelerates Aging

చాలామంది పడుకున్నప్పుడు గురక పెడుతూ ఉంటారు. నిద్రలో వారికి తెలియకుండానే గురక పెడుతూ ఉంటారు. గురక రావడానికి గల కారణం ముక్కుతో కాకుండా నోటితో శ్వాసను పీల్చుకోవడం వల్ల ఇలా గురకపెట్టినట్టుగా శబ్దం వస్తుంది. చాలామంది గొడవ పెట్టినప్పుడు చాలా భయంకరంగా గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టే వ్యక్తులు చక్కగానే నిద్ర పోతారు. కానీ వాళ్లు పెట్టే గురక వల్ల ఇతరులు ముఖ్యంగా జీవిత భాగస్వాములకు నిద్ర పట్టదు. గురక నయం చేయలేని సమస్యేం కాదు. శ్వాస తీసుకునే సమయంలో సహజంగా ఎదుర్కొనే సమస్య.

గొంతు వెనకాల భాగం వదులై శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో నిద్రలో శ్వాస ఆగిపోతూ ఉంటుంది. అప్పుడు మెదడుకు అందే సంకేతాలు తిరిగి శ్వాస తీసుకునేలా ప్రేరేపిస్తాయి. అలా గురక పెడుతూ మళ్లీ శ్వాస తీసుకుంటారు. నిద్ర పోయే సమయంలో ఇదేదీ మనకు తెలియదు. గురక పెట్టే కొంత మందిలో నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రి గురక వల్ల పగలు అలసట, చిరాకు, మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. అయితే ఒకవేళ మీరు గురకలు పెడుతుంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే గురకలు ఎక్కువగా పెడితే ముసలితనం వస్తుందట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే. నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

పగటి పూట నిద్రమత్తు వస్తుంటుంది. పనిపై ఏకాగ్రత ఉంచలేం. ఉత్పత్తి తగ్గుతుంది. ఇవే కాదు గురక, నిద్ర లేమి వల్ల వృద్ధాప్యమూ త్వరగానే వస్తుంది. గురకతో ఇబ్బంది పడే వారి శారీరక వయస్సు త్వరగా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే గురక, నిద్రలేమి వల్ల వచ్చే వృద్ధాప్యం సీప్యాప్ చికిత్స క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శారీరక వృద్ధాప్యాన్ని వెనక్కి మళ్లించే అవకాశం ఉంటుందట. కాబట్టి మీరు కూడా గురకతో ఇబ్బంది పడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా, తగిన చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గురక మరింత ఎక్కువగా వస్తున్నప్పుడు వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.