Diabetes And Walking: వృద్ధులు ఈ పని క్రమం తప్పకుండా చేస్తే మధుమేహాన్ని అదుపులో పెట్టొచ్చట.. పూర్తిగా తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త రకాల వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. వైద్యులు కూడా అందుకు తగ్గట్టుగానే మందులను

  • Written By:
  • Publish Date - August 22, 2022 / 06:30 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త రకాల వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. వైద్యులు కూడా అందుకు తగ్గట్టుగానే మందులను తయారు చేస్తున్నారు. అయితే రోగానికి కేవలం మందులు వాడుతూ, వైద్య చికిత్స తీసుకోవడం మాత్రమే పరిష్కారం కాదు శారీరక వ్యాయామం కూడా చేయడం మంచిది అని అంటున్నారు నిపుణులు. అందులోనూ మరీ ముఖ్యంగా నడకం చాలా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన ఒక అధ్యాయంలో ఇదే విషయం నిజం అని రుజువయింది.

70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు కలిగిన వృద్ధుల్లో నిత్యం నడవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ సమస్య తగ్గుతుంది అని తాజాగా అధ్యయనంలో తేలింది. తాజాగా జరిపిన అధ్యయనంలో 65 ఏళ్లు నా వృద్ధులపై పరిశోధన జరపగా.. వృద్ధులు రోజు నడిచే దానికంటే ఒక 1000 అడుగులు ఎక్కువ వేస్తే డయాబెటిస్ 6% తగ్గుతుందట. అలాగే రోజుకు 2000 అడుగులు అదనంగా నడవగలిగితే టైప్ టు డయాబెటిస్ రిస్కు 12 శాతం తగ్గుతుంది అని తేల్చి చెప్పారు నిపుణులు.

అయితే తాజాగా జరిగిన అధ్యయనం కోసం మ‌ధుమేహం లేని 65 ఏండ్ల పైబ‌డిన వృద్ధుల‌ను ఎంచుకొని వారి కుడి తుంటి పై యాక్సిల‌రోమీట‌ర్‌లను అమ‌ర్చి వారంరోజుల‌పాటు రోజూ 24 గంట‌ల‌చొప్పున వాటిని తీయ‌కుండా ఉంచుకోవాల‌ని సూచించారు.ఆ త‌ర్వాత ఏడు సంవ‌త్స‌రాల‌పాటు వారి ఆరోగ్య‌ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించారు. ఈ ప‌రిశోధ‌న‌లో తేలిందేమిటంటే రోజూ ఎక్కువ అడుగులు వేసిన వారిలో చాలా త‌క్కువ మంది మ‌ధుమేహం బారిన‌ప‌డ్డారు. కానీ, చాలా త‌క్కువ‌గా న‌డిచిన వారిలో ఎక్కువ మందికి టైప్‌-2 డ‌యాబెటిస్ వ‌చ్చిందట. కాబట్టి వృద్ధుల్లో నడకకు మధుమేహానికి సంబంధం ఉంది అని తేల్చి చెప్పారు.