Site icon HashtagU Telugu

Eating Eggs: గుడ్లు నిజంగా కొలెస్ట్రాల్‌ను పెంచుతాయా? రోజుకు ఎన్ని ఎగ్స్ తింటే మంచిది..?

Foods Avoid With Eggs

Foods Avoid With Eggs

Eating Eggs: మనలో చాలామంది గుడ్లు తినడానికి ఇష్టపడతారు. కానీ అది మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందా? ఈ విషయంపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అల్పాహారంగా ఉడకబెట్టిన గుడ్లు (Eating Eggs) తినమని చాలా మంది తరచుగా సలహా ఇస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. ప్రతి ఆరోగ్య నిపుణుడు సూపర్‌ఫుడ్‌లను తినమని సిఫార్సు చేస్తారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు గుడ్లు తినాలా..? వారు ఎంత పరిమాణంలో గుడ్లు తీసుకోవాలి? అనే అంశాల‌ను ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం.

గుడ్లు నిజంగా కొలెస్ట్రాల్‌ను పెంచుతాయా?

ఉదయాన్నే అల్పాహారంతో పాటు గుడ్లు తినడానికి ఇష్టపడతాం. లేదా ఆమ్లెట్ తింటాం. గుడ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ ఉందని అనేక పరిశోధనల ద్వారా రుజువైంది. ఈ రకమైన కొలెస్ట్రాల్ మన శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను సృష్టిస్తుంది. ఇది సంతృప్త లేదా ట్రాన్స్ ఫ్యాట్ కలిగి ఉండదు కాబట్టి.. ఇది LDL స్థాయిని పెంచదు అంటే చెడు కొలెస్ట్రాల్‌ను పెంచ‌దు అని నిపుణులు చెబుతున్నారు. గుడ్ల‌ను ఉడకబెట్టి మాత్రమే తినాలని మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కువ నూనెలో వేయించ‌డం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని జరుగుతుంది.

Also Read: Amul Hikes Milk Prices: మ‌రోసారి పాల ధ‌ర‌ల‌ను పెంచిన అమూల్‌.. ఈసారి ఎంతంటే..?

ఒక వ్యక్తి ఎన్ని గుడ్లు తినాలి?

గుడ్లు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బుల నుండి మనలను రక్షిస్తుంది. నిపుణుల‌ ప్రకారం.. ఒక వ్య‌క్తి రోజుకు రెండు గుడ్లు తింటే అది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంత‌కంటే ఎక్కువ తినాలనుకుంటే వైద్యుడిని సంప్రదించండి. హెవీ వర్కవుట్స్ చేసే వారు గుడ్లు ఎక్కువగా తినాలి.

ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి

రోజువారీ జీవితంలో మనం తినే కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటి కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి వేగంగా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఈ విషయాలను నివారించండి లేకపోతే మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

We’re now on WhatsApp : Click to Join

రెడ్ మీట్ – ఇది ప్రోటీన్ గొప్ప మూలం అయినప్పటికీ ఇందులో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మితంగా తినండి.

పాలు – పాలు మీకు త‌క్ష‌ణ శ‌క్తిని ఇస్తుంది. కానీ మీరు ఫుల్ ఫ్యాట్ పాలను తాగితే అది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. క్రీమ్ తీసివేసిన తర్వాత మీరు పాల‌ను తీసుకోవాలి.

ఆయిల్ ఫుడ్స్ – అనేక వంట నూనెలు మన ఆరోగ్యానికి శత్రువులు అనడంలో సందేహం లేదు. దీని అధిక వినియోగం అనేక వ్యాధులను ఆహ్వానిస్తుంది.