Site icon HashtagU Telugu

Exercise and Diabetes: ఇలా చేస్తే డయాబెటిస్ నయం అవుతుందట..!!

Diabetes Test Imresizer

Diabetes Test Imresizer

శారీరక శ్రమ లేనట్లయితే ఊబకాయానికి దారితీస్తుంది. ఊబకాయం మధుమేహాన్ని కారణం అవుతుంది. మధుమేహం రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీంతో తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. క్లిష్టమైన చికిత్సలు అవసరం అవుతాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం అంటున్నారు జార్జియా మెడికల్ కాలేజీ వైద్యులు.

మనశరీరంలో కొత్త రక్తనాళాలు రూపొందే ప్రక్రియను ఆంజియోజెనిసిస్ అంటారు. ఇందుకు ATP7A అనే ప్రొటీన్ చాలా అవసరం ఉంటుంది. SOD3అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ ప్రక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అధికరక్తపోటు, మధుమేహం వంటి సందర్భాల్లో ఈ SOD3స్థాయి తగ్గుతుంది. ఫలితంగా దెబ్బతిన్న రక్తనాళాలస్థానం కొత్తవి ఏర్పడవు. అనూహ్యంగా రోజుకు 45నిమిషాల పాటు సాధారణ
వ్యాయామం చేయగలిగితే…ఆంజియోజెనిసిస్ ప్రక్రియ చురుగ్గా మారడాన్ని గమనించారు. ఎలుకలతోపాటు..మనుషుల మీద కూడా ఈ ప్రయోగం విజయవంతం అయ్యింది. డయాబెటిస్ బాధితుల వ్యాయామం పైపు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు.