Site icon HashtagU Telugu

Cooking Oil: ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోండి?

Edible Oil Import

Cooking Oil

కూరల్లో చాలా వరకు నూనె లేని కూరలు ఉండవేమో. అయితే కొన్ని రకాల కూరల్లో నూనెను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరికొన్ని కూరల్లో కొంచెం నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పరిమితికి మించి నూనెని తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి నూనెను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. అయితే చాలా వరకు నూనెను ఉపయోగించిన నూనె ను మళ్ళీ మళ్ళీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒకసారి ఉపయోగించాను నూనె ను మళ్ళీ ఉపయోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

మరి వాడిన నూనెను మళ్ళీ వాడడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు, చిత్తవైకల్యం, అల్జీమర్స్, పార్కిన్సన్ అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒకసారి ఉపయోగించిన నూనె ను మళ్ళీ ఉపయోగించడం వల్ల అది ఆల్డిహైడ్లు వంటి అనేక ప్రమాదకరమైన సమ్మేళనాలను పెద్ద మొత్తంలో విడుదల చేస్తుంది. నూనెను తిరిగి వేడి చేసినప్పుడు హైడ్రాక్సీ ట్రాన్స్ అనే హానికరమైన అణువు కూడా విడుదల అవుతుంది. అది చాలా విషపూరితమైనది అని చెప్పవచ్చు.

అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెను వేడి చేసినప్పుడు, కొన్ని కొవ్వులు ట్రాన్స్ ఫ్యాట్స్ గా మారుతాయి. పొగబట్టిన నల్ల నూనెను తిరిగి వేడి చేసినప్పుడు ఇది ఎక్కువ ట్రాన్స్ కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయి మరింత పెరుగుతుంది. అందుకే వంటలు చేయడానికి ఎప్పుడు ఫ్రెష్ కుకింగ్ ఆయిల్ ను మాత్రమే ఉపయోగించాలి. అయితే నూనె ధరలు అధికంగా ఉన్నాయి అటువంటప్పుడు ఎలా ఉపయోగించాలి అనుకున్న వారు మీరు ఏదైనా వంట చేస్తున్నప్పుడు దానికి ఎంత మొత్తంలో అయితే అవసరమవుతుందో అంత మొత్తాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల వంట నూనెను ఆదా చేయవచ్చు అలాగే అలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు.