Health Tips: పొరపాటున కూడా ఈ ఐదు రకాల పండ్లను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకండి?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ లు అన్నవి తప్పనిసరిగా ఉంటున్నాయి. ఫ్రిడ్జ్ ల్లో పండ్లు కాయగూరలు అలాగే తినే ఆహార పదార్థాలు ఇల

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 08:23 PM IST

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ లు అన్నవి తప్పనిసరిగా ఉంటున్నాయి. ఫ్రిడ్జ్ ల్లో పండ్లు కాయగూరలు అలాగే తినే ఆహార పదార్థాలు ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటారు. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని చాలామంది అలా చేస్తూ ఉంటారు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆహారం, పానీయాలను నిల్వ చేయడానికి ఫ్రిడ్జ్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మాంసం, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు వంటి పాడైపోయే ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయటం వల్ల తాజాదనం కోల్పోకుండా ఉంటాయి. మీకు తెలుసా ఫ్రిజ్లో కొన్ని రకాల ఆహార పదార్థాలు పండ్లను అస్సలు ఉంచకూడదట.

రిఫ్రిజిరేటర్ లోని తక్కువ ఉష్ణోగ్రతలు ఆహారాన్ని చెడిపోయేలా చేసే ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిలువరిస్తాయి. మరి ఇలాంటి పనులను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కొన్ని రకాల పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకపోవటమే బెటర్. ఫ్రిజ్‌లో పండ్లను ఉంచడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అరటిపండు ఫ్రిజ్‌లో ఎప్పుడూ పెట్టకూడదు. అరటిపండును రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే చాలా త్వరగా నల్లగా మారుతుంది. అరటిపండ్ల నుండి ఇథిలీన్ వాయువు బయటకు వస్తుంది. దీనివల్ల ఫ్రిజ్ లో ఉంచిన ఇతర పండ్లను త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది, కాబట్టి అరటిపండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో లేదా ఇతర పండ్లతో ఉంచరాదు.

వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఈ పండు చాలా పెద్దది కాబట్టి ఒక్కసారిగా తినడం కష్టం. అటువంటి పరిస్థితిలో, చాలా మంది పుచ్చకాయ ముక్కలను రిఫ్రిజిరేటర్‌లో భద్రపరుస్తారు. ఇలా చేయటం చాలా తప్పు. పుచ్చకాయను ముక్కులగా కోసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి యాంటీ ఆక్సిడెంట్లు పాడైపోతాయి. తినడానికి ముందు కొంత సమయం వరకు వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచటం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. యాపిల్‌ లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే అవి త్వరగా పండిపోతాయి. యాపిల్‌లో ఉండే క్రియాశీల ఎంజైమ్‌లు కారణంగా ఆపిల్ త్వరగా పండుతుంది. అందువల్ల యాపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచరాదు.

ఎక్కువ కాలం యాపిల్స్ నిల్వ చేయాలనుకుంటే వాటిని కాగితంలో చుట్టి ఉంచటం మంచిది. రేగు, చెర్రీస్ వంటి విత్తనాలు ఉన్న పండ్లను కూడా రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. మామిడిని రిఫ్రిజిరేటర్‌లో కూడదు. దీని వల్ల మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి. అంతేకాకుండా మామిడిలోని పోషకాలు కూడా నశిస్తాయి. మామిడి పండ్లను కార్బైడ్‌తో పండిస్తారు. కాట్టి వాటిని నీటిలో తడిపితే త్వరగా పాడవుతుంది. వేసవిలో రుచిగా ఉండే లిచీని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. లిచీని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల పైభాగం బాగానే ఉన్నా గుజ్జు లోపలి బాగం చెడిపోతుంది.