Site icon HashtagU Telugu

Health Care Tips: వేసవిలో మామిడికాయ షేక్ ని తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Health Care Tips

Health Care Tips

వేసవికాలం వచ్చింది అంతే చాలు చాలామంది మామిడి పండు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొంతమంది జ్యూస్ షాపులకు వెళ్లి ఎక్కువగా మ్యాంగో షేక్ ని తాగుతూ ఉంటారు. అయితే మామిడి పండు తినడం మంచిదే కానీ మ్యాంగో షేక్ ని తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాగా మామిడిపండులో పులుపు, తీపి, పాలలోని తీపి ఉంటాయి. వీటి మిక్స్ చేసిన షేక్స్‌ని ఎక్కువగా తాగడం వలన నష్టపోవాల్సి రావచ్చట. మామిడి షేక్‌ను ఎక్కువగా తాగితే అది కడుపు నొప్పిని కలిగిస్తుందట.

విరేచనాల సమస్య కూడా తలెత్తవచ్చని చెబుతున్నారు. కడుపు నొప్పి కారణంగా వాంతి సమస్య కూడా తలెత్తుతుందట. మామిడిలో సహజంగానే వేడిని కలిగించే లక్షణాలు ఉంటాయట. ఐస్ మిక్స్ చేసి తాగినా మామిడి దాని లక్షణాన్ని కోల్పోదట. కడుపులోకి వెళ్లాక దాని ప్రభావాన్ని చూపుతుందట. మ్యాంగో షేక్స్ ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందట. అందుకే మ్యాంగో షేక్స్‌ ని వీలైనంత తక్కువగా తాగాలని చెబుతున్నారు. మామిడి, పాలు కలయిక చర్మంపై అలెర్జీని కలిగిస్తుందట.

ఇప్పటికే అలర్జీ సమస్య ఉంటే మ్యాంగో షేక్ తాగే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలని నువ్వు నన్ను చెబుతున్నారు. మామిడి, పాలు కలయిక చర్మంపై అలెర్జీని కలిగిస్తుందట. అయితే ఇప్పటికే అలర్జీ సమస్య ఉంటే మ్యాంగో షేక్ తాగకపోవడమే మంచిదని, ఒకవేళ తాగాలి అనుకున్న వారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. మామిడి పండ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. పాలు కొవ్వుతో కూడినవి. ఈ రెంటిని మిక్స్‌ గా ఎక్కువగా తాగడం వల్ల క్రమంగా బరువు పెరగడం మొదలై ఏదో ఒకరోజు ఊబకాయానికి గురవుతారట. కాబట్టి మ్యాంగో షేక్ తాగాలి అనిపించినా కూడా మితంగా తీసుకోవాలని, పైన చెప్పిన అనారోగ్య సమస్యలు మ్యాంగో షేక్ ని తక్కువగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

Exit mobile version