Site icon HashtagU Telugu

Health: ముందస్తు జాగ్రత్త చర్యలతో నరాల బలహీనతకు చెక్ పెట్టొచ్చు

Bone Density

Bone Density

Health: నరాల బలహీనత సమస్యతో బాధపడే వాళ్ళు ఈ చిన్న చిన్న చిట్కాలని పాటిస్తే సరిపోతుంది. ఎప్పుడూ కూడా చిన్న సమస్యలనైనా పెద్ద సమస్యలనైనా నెగ్లెక్ట్ చేయకూడదు ఇది మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. పైగా సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నరాల బలహీనత సమస్యతో బాధపడే వాళ్ళు మాత్రం ఈ విధంగా అనుసరించాలి. మెదడు వెన్నుపాము నుండి శరీరంలో వివిధ భాగాలకు సందేశాలని నరాలు తీసుకువెళతాయి దీన్ని నాడీ వ్యవస్థ అంటారు. శ్వాసక్రియ జీర్ణక్రియ ఉష్ణోగ్రత నియంత్రణ వంటి వాటికి నాడి వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

నాడీ వ్యవస్థని కనుక మీరు బలంగా మార్చుకోవాలంటే వీటిని కచ్చితంగా డైట్ లో చేర్చుకోండి. పసుపు..పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది మెదడు ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది ఆల్జీమర్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి వాళ్లకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఆకుకూరలు..ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నరాల బలహీనత వంటి ఇబ్బందుల్ని ఆకుకూరలు దూరం చేస్తాయి కనుక మీరు ఆకుకూరలని కూడా డైట్ లో చేర్చుకోవాలి.

పాలకూర బచ్చల కూర లో మెగ్నీషియం కాపర్ వంటివి ఉంటాయి. కనుక వాటిని డైట్ లో చేర్చుకుంటే మంచిది. ఫ్యాటీ ఫిష్..సాల్మన్, టున మొదలైన ఫ్యాటీ ఫిష్ లని కూడా డైట్ లో చేర్చుకోండి వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నట్స్..బాదం జీడిపప్పు వంటి నట్స్ ని కూడా డైట్లో చేర్చుకోండి నాడీ వ్యవస్థని ఆరోగ్యంగా మారుస్తాయి ఇవి.