Eggs in Winter Season: శీతాకాలంలో గుడ్డు తినడం మంచిదేనా.. గుడ్డు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా?

మామూలుగా శీతాకాలంలో రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దగ్గు జలుబు, జ్వరం లాంటి సమస్యలతో పాటు రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటా

Published By: HashtagU Telugu Desk
Mixcollage 26 Dec 2023 08 50 Pm 9322

Mixcollage 26 Dec 2023 08 50 Pm 9322

మామూలుగా శీతాకాలంలో రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దగ్గు జలుబు, జ్వరం లాంటి సమస్యలతో పాటు రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి.. అందుకే వైద్యులు చలికాలంలో సరేనా జాగ్రత్తలు పాటించడంతో పాటు సరైన పోషకాలు పెరిగిన ఆహారం తీసుకోమని చెబుతూ ఉంటారు. అయితే చలికాలంలో తీసుకోవాల్సిన వాటితో గుడ్డు కూడా ఒకటి. గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వింటర్ సీజన్ లో గుడ్డు తినడం చాలా అవసరం. గుడ్లు శరీరంలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి హెల్ప్ చేస్తాయి. అలాగే గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.

ఇది కండరాల పెరుగుదల, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గుడ్లు బాడీని వెచ్చగా ఉంచడానికి సహాయ పడతాయి. అదే విధంగా గుడ్లలో ఉండే మంచి కొవ్వులు కణాల విస్తరణను ప్రోత్సహించి అవయవాలను రక్షిస్తాయి. విటమిన్ డి అనేది అసాధారణమైన ఆహార వనరుగా చెప్పవచ్చు. సూర్య కాంతిలో ఉండటం వల్ల విటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది. కానీ ఈ వింటర్ సీజన్ సూర్య రశ్మి అనేది తక్కువగా లభిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ డి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ సీజన్ లో అంటు వ్యాధులు, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు విటమిన్ డి ఉపయోగ పడుతుంది. గుడ్లను మితంగా తీసుకుంటే బరువు తగ్గేందుకు కూడా ఉపయోగ పడుతుంది.

అంతే కాకుండా గుడ్లు తక్కువ ధరలో లభిస్తాయి. గుడ్లను ఉడక బెట్టి, ఆమ్లెట్ ఇలా ఏ రూపంలో తీసుకున్నా వెయిట్ లాస్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. గుడ్డును ఒకటి తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇతర ఆహారలు తినలేము. అలాగే గుడ్లలో ఉండే కొవ్వ శాతం శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సహాయ పడుతుంది. శీతాకాలం మొత్తం గుడ్లను తినడం వల్ల ప్రయోజకరంగా ఉంటుంది. గుడ్లు అవయవాలను రక్షిస్తాయి. కోడి గుడ్లలో జింక్ శాతం ఎక్కువగా ఉంటుంది. గుడ్ల రూపంలో జింక్ తీసుకోవడం వల్ల ఇది జలుబు, ఫ్లూ, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. శరీరానికి అవసరం అయిన ఆరోగ్య పోషకాలను అందుకోవడానికి సమతుల్య ఆహారంతో కలిపి గుడ్లను తింటే మంచిది.

  Last Updated: 26 Dec 2023, 08:51 PM IST