Site icon HashtagU Telugu

Neck Pain Relief: మెడ నొప్పితో తల పక్కకు తిప్ప లేక పోతున్నారా.. ఇలా చేస్తే చిటికెలో నొప్పి మాయం అవ్వాల్సిందే?

Neck Pain Relief

Neck Pain Relief

మామూలుగా మెడ నొప్పి అనేక రకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, టీవీలు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను తరచుగా ఒకే భంగిమలో కూర్చుని గంటల తరబడి చూడడం వల్ల, రాత్రిళ్ళు పడుకున్నప్పుడు మెడ భాగాన్ని కదిలించకుండా అలాగే పడుకోవడం వల్ల ఇలా అనేక రకాలు కారణాల వల్ల మెడనొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఈ మెడ నొప్పి కారణంగా ఒక్కొక్కసారి తల పక్కకు తిప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మెడ అంతా కూడా పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

రాత్రిల్లు ఒకే భంగిమలో పడుకుని అలాగే మెడ స్ట్రక్ అయిపోయి ఉంటే ఉదయం నిద్రలేచిన వెంటనే మెడ నొప్పి అనిపిస్తే ఒక్కసారిగా ఎటువంటి పని చేయకూడదట. కొంచెం నొప్పి ఉన్నా సరే ముందుగా నెమ్మదిగా మెడను కదిలించాలట. తరువాత మెడ కండరాలను రిలాక్స్ చేయడానికి తలను మెల్లగా కుడివైపు తిప్పాలట. కొన్ని సెకన్ల తర్వాత ఎడమవైపు తిప్పాలని చెబుతున్నారు. అలాగే తలను పైకి, కిందకు కదిపితే అక్కడి కండరాలకు నెమ్మదిగా ఊరట లభిస్తుందట. మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వేడి లేదా చల్లటి నీటితో మాయిశ్చరైజింగ్ చేయడం బాగా ఉపయోగపడుతుందట.

మార్కెట్లో హాట్, కోల్డ్ కాంప్రెషన్ ప్యాడ్స్ దొరుకుతాయి. వీటిని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచితే మెడ కండరాలు నిగ్రహం తగ్గి, నొప్పి ఉపశమనం పొందవచ్చట. ఇంట్లోనే చేయాలంటే, శుభ్రమైన బట్టను వేడినీటిలో ముంచి మెడపై ఉంచాలట. అలాగే చల్లని నీటిలో ముంచి కూడా ప్రయత్నించవచ్చట. ఇలా రోజుకు 2 నుంచి 3 సార్లు ఇలా చేస్తే మెడ నొప్పి తగ్గుతుందట. అధికంగా మెడ నొప్పి అనిపించినప్పుడు వేడి నీటితో స్నానం చేయడం మంచి పరిష్కారం అని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి స్నానం చేస్తే మెడ కండరాలు మెత్తబడతాయట. ఇది కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా మెడ భాగంలో రక్తప్రసరణను మెరుగుపరిచేలా చేస్తుందట. ఇలా చేయడం వల్ల వాపు కూడా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా మెడ నొప్పి తగ్గించుకోవాలంటే కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా బాదం నూనెను కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో మృదువుగా మర్దన చేయాలట.ఇలా మర్దన వల్ల కండరాలు మరింత శాంతించడంతో పాటు వాపు, నొప్పి తగ్గుతాయట. ఈ విధానం రాత్రి పడుకునే ముందు చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు.