Lip Care Tips: పెదాలు నల్లగా మారి ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే?

మామూలుగా చాలా మందికి పెదవులు నల్లగా ఉంటాయి. కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలలో కూడా చాలామందికి పెదాలు నలుపుగా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఎటువంటి చెడ్డ అలవాట్లు లేకపోయినప్పటికీ పెదవులు నల్లగా కనిపిస్తూ ఉంటాయి. కొందరికి మాత్రం

  • Written By:
  • Publish Date - July 5, 2024 / 06:30 PM IST

మామూలుగా చాలా మందికి పెదవులు నల్లగా ఉంటాయి. కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలలో కూడా చాలామందికి పెదాలు నలుపుగా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఎటువంటి చెడ్డ అలవాట్లు లేకపోయినప్పటికీ పెదవులు నల్లగా కనిపిస్తూ ఉంటాయి. కొందరికి మాత్రం పెదవులు ఎరుపుగా పింక్ కలర్ లో ఉంటాయి. నల్ల పెదాలు ఉన్నవారు పెదాలను పింక్ కలర్ , రెడ్ కలర్లోకి మార్చుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు వంటింటి చిట్కాలు పాటిస్తే ఇంకొందరు బ్యూటీ ప్రాడక్టులను ఉపయోగిస్తూ ఉంటారు.

అయినప్పటికి కొన్ని కొన్ని సార్లు ఫలితం లభించదు. మరి అలాంటప్పుడు పెదాలు ఎరుపు రంగులోకి మారాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు బీట్రూట్ ను పెదాలకు రాయడం వల్ల పెదవులు పింక్ కలర్ లోకి మారుతాయి. అంతేకాకుండా అద్భుతమైన నిగారింపు కూడా వస్తుంది. కీరా కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. కీరా కేవలం డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. పెదాల నల్లదనాన్ని పోగొట్టేందుకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.

ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి వల్ల పెదాలకు లాభం కలుగుతుంది. కీరా రసాన్ని రోజూ పెదాలకు రాయడం వల్ల నెమ్మదిగా పెదాలు పింక్ కలర్ లోకి మారుతాయి. మన శరీరంలో మిగిలిన చర్మంతో పోల్చుకుంటే పెదాలపై ఉండే చర్మం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలాంటి పదాలు పట్టించుకోకపోతే నెమ్మదిగా నిలబడి పోతుంటాయి. అయితే పంచదార కూడా పెదాలపై దూరం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. పంచదార తో తరచుగా మీ పెదాలను స్క్రబ్ చేస్తూ ఉండడం వల్ల ఎరుపురంగు ఒక పెదాలు మీ సొంతం చేసుకోవచ్చు. పెదాలకు మాయిశ్చరైజర్ చాలా అవసరం. దీనివల్ల పెదాలు పగలకుండా ఉంటాయి. నల్లబడవు. ముఖానికి రాసినట్టే పెదాలకు కూడా రోజూ మాయిశ్చరైజర్ రాస్తుండాలి. అప్పుడే పెదాలు పింక్ రంగులో మెరుస్తుంటాయి. నిమ్మకాయతో పెదాల్ని రోజూ మసాజ్ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే
పెదాలు మృదువుగా, పింక్ రంగులో మిళమిళలాడుతూ ఉండాలంటే తేనె, పంచదార మీగడ ఈ మూడింటిని కలిపి ఈ మిశ్రమాన్ని రోజూ పెదాలకు రాస్తుండాలి.