Site icon HashtagU Telugu

Pimples: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!

Pimples

Pimples

మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత శరీరంలో కొన్ని రకాల మార్పులు రావడం అన్నది సహజం. అటువంటి వాటిలో మొటిమలు రావడం కూడా ఒకటి. ఒక వయసు వచ్చిన తర్వాత చాలామందికి ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. కొందరికి ఒకటి రెండు వస్తే మరికొందరికి ముఖం నిండా మొటిమలు వచ్చి ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. కొందరు వాటిని చూసి చూడనట్టుగా వదిలేస్తే మరికొందరు వారిని తగ్గించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు వాటిని గిల్లడం లేదంటే వాటిని ఏదైనా పదునైన వాటితో గుచ్చడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు.

వయసుతో పాటుగా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. మొటిమల వల్ల చర్మంలో ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ మూసుకుపోయిన రంధ్రాలలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అలాగే దీనివల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. అయితే చాలా మొటిమలు మొఖంపై మచ్చలను కలిగిస్తాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. అందుకే మొటిమలకు చికిత్స చేయడం చాలా ముఖ్యం. మొటిమలను తగ్గించుకోవడానికి మీరు మందులనే వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే కొన్ని నేచురల్ వస్తువుల సహాయంతో కూడా మొటిమలను నయం చేయవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొటిమలను తగ్గించడంలో కలబంద ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

అలాగే చర్మాన్ని తేమగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అందుకోసం మీరు కలబంద జెల్ ను తీసి ముఖానికి అప్లై చేసి పది నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచి ఫలితాలను చూడవచ్చు. ఇలా తరచుగా చేస్తూ ఉండటం వల్ల ముఖంపై మొటిమలు సమస్యలు తగ్గిపోవడంతో పాటు మొటిమలు రాకుండా అరికట్టవచ్చు. టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమల సమస్యను తగ్గించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మార్కెట్లో లభించే మొటిమల చికిత్స క్రీముల మాదిరిగా ఇది మీ చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. అలాగే మొటిమలు తొందరగా తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీన్ని నేరుగా మొటిమలపై ఉపయోగించవచ్చు. దీన్ని రాత్రంతా అలాగే వదిలేయాలి.

దీన్ని ఉపయోగించడానికి ముందు పలుచగా చేయాలి. అదేవిధంగా చాలామంది బరువు తగ్గడం కోసం గ్రీన్ టీ ని తాగుతూ ఉంటారు. అయితే ఈ గ్రీన్ టీ మొటిమల సమస్యను కూడా తగ్గిస్తుందట. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగులు కొద్దిగా తడిపి లేదంటే గ్రీన్ టీ తయారుచేసి చల్లార్చి ఆపై మీ మొటిమలపై అప్లై చేస్తే మొటిమల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఆపిల్ సైడర్ వెనిగర్ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. దీనిని ఉపయోగిస్తే మొటిమలు తగ్గుతాయి. కానీ ఇది మీ చర్మాన్ని చికాకుపెడుతుంది. అందుకే దీని పరిమాణం కంటే మూడు రెట్లు ఎక్కువ నీటిని కలిపి మొటిమలపై 30 సెకన్ల పాటు అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలట. అలాగే తేనె కూడా మొటిమలను తగ్గించడంలో ఎంత ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. మొటిమల వల్ల కలిగే మంటను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. మీరు దీన్ని ఫేస్ మాస్క్ గా కూడా ఉపయోగించవచ్చు.లేదా మొటిమలపై నేరుగా అప్లై చేయొచ్చు.

note: పైన చెప్పిన విషయాలు ఎటువంటి సందేహాలు ఉన్న ఒకసారి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.