ప్రస్తుతం చలికాలం కావడంతో చాలామందిని దగ్గు జలుబు ముక్కుదిబ్బడ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యల కారణంగా చాలా మంది నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. జలుబు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఇక దగ్గుతో ఛాతి మొత్తం నొప్పిగా మంటగా అనిపిస్తూ ఉంటుంది. అయితే దగ్గు, జలుబును తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగించడంతోపాటు ఆయుర్వేద చిట్కాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మీరు కూడా అలా దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతున్నారా. అయితే అలాంటప్పుడు ఏం చేస్తే వాటి నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
గొంతు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకొని బాగా పుక్కిలించాలి. ఉదయం నిద్ర లేవగానే ఈ విధంగా చేయాలి. ఇలా చేస్తే దగ్గు కంట్రోల్ అవ్వడంతో పాటు నోరులోనే బ్యాక్టీరియా కూడా క్లీన్ అవుతుంది.
అలాగే నిమ్మరసం తేనే కలిపి సమానంగా తీసుకుంటే గొంతు సమస్యలు తగ్గుముఖం పడతాయట. దీనిలో ఉండే యాక్టివిటీ బ్యాక్టీరియా లక్షణాలు గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అలాగే నిమ్మరసంలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసాన్ని, తేనెను నేరుగా తీసుకున్నా గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయట.
అలాగే అల్లంతో చేసిన టీను తాగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చట. రోగనిరోధక శక్తి పెరుగుతుందట. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దగ్గు, జలుబు, గొంతు సమస్యలను దూరం చేస్తాయి. అల్లాన్ని టీలో వేసుకుని తీసుకున్నా లేదా అల్లం ముక్కలను నీటిలో మరిగించి తీసుకున్నా పర్లేదు. కానీ మిల్క్ టీ కంటే నేరుగా పెట్టుకునే అల్లంటీ తోనే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని, దగ్గు జలుబు ఉన్నప్పుడు ప్రతిరోజు రెండు కప్పులు తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు..
చలికాలంలో చికెన్ సూప్‌ని వేడివేడిగా తాగితే చాలా మంచిగా ఉంటుందట. చలి దూరమవుతుందట. అలాగే దానిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మిమ్మల్ని వెచ్చగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయట. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయట. జలుబు సమయంలో ముక్కు దిబ్బడ ఉంటే అది కూడా దూరమైపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అదేవిధంగా శీతాకాలంలో తీసుకోవాల్సిన డ్రింక్స్ లో పాలు పసుపు కలిపిన డ్రింక్ కూడా ఒకటి. దగ్గు, జలుబు సమస్యలు దూరం అవ్వాలి అంటే పాలలో పసుపు వేసుకుని తాగాలని చెబుతున్నారు. రుచి కోసం తేనెను వేసుకోవచ్చట.