Kidney Stones: కిడ్నీలో రాళ్లను న్యాచురల్ గా నివారించేందుకు బెస్ట్ టిప్స్ ఇవే!

ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్లు పడటం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా కిడ్నీ స్టోన్స్ సమస్య ఇబ్బంది పడుతున్నారు.

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 06:30 AM IST

ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్లు పడటం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా కిడ్నీ స్టోన్స్ సమస్య ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలా కిడ్నీలో రాళ్లు పడడానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. అందులో రక్తంలో ఎక్కువ క్యాల్షియం ఉండడం, విటమిన్ డి సప్లిమెంట్లని ఎక్కువ రోజులు తీసుకోవడం, అదేవిధంగా పాలకూర,నట్స్, చాకోలెట్, వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం అదేవిధంగా తగినంత నీరు తాగకపోవడం, అధిక బరువుని కలిగి ఉండటం, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ని తీసుకోవడం లాంటివి కిడ్నీలో రాళ్లు పడటానికి ఎక్కువ కారణాలుగా చెప్పుకోవచ్చు.

అయితే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడాలి అంటే పలు ఆయుర్వేద వంటింటి చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కిడ్నీలో రాళ్లు కడగాలి అంటే ఒక స్పూన్ నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఆరు నెలలు పాటు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు నివారించడమే కాకుండా, కిడ్నీలో తిరిగి రాళ్లు వచ్చే సమస్య ఉండదు. అదేవిధంగా నిమ్మరసంలో సైంధవ లవణం కలుపుకొని తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. పుచ్చకాయలో నీరు పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల పుచ్చకాయ జ్యూస్ లేదా ముక్కల రూపంలో ప్రతిరోజు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి.

అలాగే ప్రతిరోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లతో పాటుగా ఇతర వ్యర్థాలు కూడా తొలగిపోతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు నివారణ కోసం వారంలో ఒకసారి ఖాళీ కడుపుతో దానిమ్మ జ్యూస్ కానీ దానిమ్మ గింజలు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగే అవకాశం ఉంది అని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పదినిమిషాల పాటు మరిగించి ఆ రసాన్ని వడకట్టి సీసాలో పోసి ఫ్రిజ్లో పెట్టుకొని ప్రతిరోజు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు యూరియన్ ద్వారా బయటికి పోతాయట. అదేవిధంగా కలబంద జ్యూస్ ని తాగినా కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడమని వైద్యులు సూచిస్తున్నారు.

పుచ్చకాయలో నీరు పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల పుచ్చకాయ జ్యూస్ లేదా ముక్కల రూపంలో ప్రతిరోజు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట. అలాగే నీరు నిమ్మరసం మిశ్రమంలో కొద్దిగా తేనె లేదా బెల్లం కలుపుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట. అయితే ఈ చిట్కాలు అన్ని పాటిస్తూనే రోజుకు ఐదు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తీసుకోవడం వల్ల రాళ్లు కచ్చితంగా కరిగిపోయాయి పోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.