Nails Biting : కొంతమందికి టెన్షన్ వచ్చినా లేదా ఖాళీగా ఉన్నా గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. గోర్లు కొరకడం అనేది కొంతమందికి ఒక హ్యాబిట్ గా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఎక్కువగా గోర్లు కొరుకుతూ ఉంటారు. కానీ అది మంచి పని కాదు.
*గోళ్ళల్లో దుమ్ము, ధూళి చేరి ఉంటాయి కాబట్టి అవి కొరకడం వలన మన శరీరంలోనికి బ్యాక్టీరియా చేరుతుంది.
* గోర్లు కొరకడం వలన గోళ్ళల్లోని బ్యాక్టీరియా మన శరీరంలోనికి వెళ్లి జీర్ణ సమస్యలు వస్తాయి.
* గోర్లు కొరకడం వలన మన దంతాలు కూడా దెబ్బతింటాయి.
* గోర్లు కొరకడం వలన నోటి చిగుళ్లకు ఇన్ఫెక్షన్లు వస్తాయి.
* గోర్లు కొరకడం వలన మన చేతి వేళ్ళ చివర్లు దెబ్బతింటాయి.
* గోర్లు కొరకడం వలన మన చేతి చివర్ల ఉన్న చర్మం పొడిబారుతుంది.
* గోర్లు కొరకడం వలన చేతి గోళ్ళ దగ్గర చర్మ సమస్యలు వస్తాయి.
* గోర్లు కొరకడం వలన వాంతులు, విరోచనాలు వచ్చే అవకాశం ఉంది.
* గోర్లు కొరకడం వలన బ్రక్సిజం వ్యాధి వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.
మన చేతివేళ్ళ గోర్లను కొరకడం వలన మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ అలవాటు ఉంటే తొందరగా మానేస్తే మంచిది.
Also Read : Coriander : కొత్తిమీరను ఎక్కువ కాలం నిలువ ఉంచాలంటే ఏం చేయాలి..?