Health-Tips: చికెన్, మటన్ …వీటిలో ఏది బెటర్..?నిపుణులు ఏం సూచిస్తున్నారు..?

నాన్ వెజ్ తినేవారిలో ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. మటన్, చికెన్ ఈ రెండింటీలో ఏది మంచిదని. కొందరేమో చికెన్ తింటే మంచిదని...మరికొందరు మటన్ ఆరోగ్యానికి మంచిదని కాదని చెబుతారు. మరికొందరు చికెన్ తో వేడి అంటే...మటన్ అయితేనే బెటర్ అని మరికొందరు అంటుంటారు.

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 11:15 AM IST

నాన్ వెజ్ తినేవారిలో ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. మటన్, చికెన్ ఈ రెండింటీలో ఏది మంచిదని. కొందరేమో చికెన్ తింటే మంచిదని…మరికొందరు మటన్ ఆరోగ్యానికి మంచిదని కాదని చెబుతారు. మరికొందరు చికెన్ తో వేడి అంటే…మటన్ అయితేనే బెటర్ అని మరికొందరు అంటుంటారు. ఇవన్నీ విని గందరగోళంలో పడిపోతుంటారు. అయితే ఈ రెండింటిలోనూ మంచి, చెడు ఉన్నాయని…అది ఎలా తీసుకుంటున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

1. సాధారణంగా చికెన్ లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయని…మటన్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇది నిజమే అంటున్నారు నిపుణులు. మటన్ చాప్స్ ( ఉదర భాగంలోని పక్కటెముకలతోకూడిన ముక్కలు) లో తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ భాగంలోని మటన్ తో కేలరీలు తక్కువగా ఉంటాయి. చికెన్ తో పోల్చితే ప్రొటీన్స్ కూడా స్వల్పంగా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.
2. చికెన్ తో పోల్చిచూస్తే..మటన్ చాప్స్ లో ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటుందని…సోడియం తక్కువగా ఉంటుందంటున్నారు. దీంతో మంచి పోషకాలు అందుతాయని చెబుతున్నారు. చికెన్ లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్నా…అందులోని కొన్ని భాగాలు మాత్రమే మేలు చేస్తాయని..మిగతావి ఆరోగ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
3.చికెన్ లోని బ్రెస్ట్ పీస్ కంటే…దిగువ భాగంలో ముఖ్యంగా లెగ్ పీసెస్ తోపాటు వింగ్స్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే చికెన్ తినేవారు బ్రెస్ట్ పీస్ కు ఎక్కువప్రాధాన్యత ఇవ్వడం మంచిదని చెబుతున్నారు.
4. మటన్ లో కూడా బాగా ఎరుపు రంగులోకి వచ్చిన ముదురు మాంసం కంటే…లేత మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ చాప్స్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. మాంసాహారంలో చేపలు తీసుకోవడం బెటర్. మటన్ లో అయితే చాప్స్, చికెన్లో బ్రెస్ట్ భాగం బెటర్ అని నిపుణులు వివరిస్తున్నారు.

పరిమితి మించి ఉండకూడదు..
మంసాహారం ఏదైనా శరీరానికి అత్యధిక కేలరీలు అందుతాయి. ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మటన్, చికెన్ వంటివి తినాలనే కోరికను అణచుకోవల్సిన అవసరం లేదని….కొద్ది మొత్తంలో తీసుకోవచ్చని చెబుతున్నారు. దీంతో శరీరానికి అవసరమైన ఐరన్, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఇతర పోషకాలు శరీరానికి అందుతాయని నిపుణులు అంటున్నారు.