Site icon HashtagU Telugu

Blood Glucose: బ్లడ్ గ్లూకోజ్ దారికి రావాలంటే భోజనం చేసిన తర్వాత ఇలా చెయ్యాల్సిందే!

Blood Sugar

Blood Sugar

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇందుకు గల కారణం ప్రస్తుత రోజుల్లో ఉండే ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. అయితే మధుమేహం సమస్యతో బాధపడుతున్నవారు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచే ఆహారానికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు తీసుకునే కొన్ని పదార్థాలలో బ్లడ్ లో గ్లూకోజ్ భారీగా పెరగకపోయినా అవి కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుదలకు పరోక్షంగా కారణం అవుతాయి.

అందువల్ల తిన్న వెంటనే గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోకుండా ఉండడానికి కొంత సమయం పాటు శరీరాన్ని శ్రమ పెట్టడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్యత ఆహారాన్ని తీసుకున్న లేదంటే నచ్చిన ఆహారాన్ని తీసుకున్న రక్తంలో సుగర్ స్థాయి పెరగకుండా ఉండడం కోసం పది నిమిషాల పాటు కండరాలకు పనిచెప్పాలి. అయితే ఇందుకోసం తిన్న తర్వాత నడవడం అలవాటుగా మార్చుకోవాలి. లేదంటే శరీరానికి శ్రమ పెట్టే పని ఏదైనా కూడా చేయవచ్చు. చిన్నారులతో పది నిమిషాల పాటు ఆడుకోవడం వంటిది కూడా మంచిదే అని చెప్పవచ్చు. అలా తిన్న తర్వాత వ్యాయామాలు, చిన్నగా డాన్స్ వేయడం లాంటివి చేయడం వల్ల ఆహారం రూపంలో రక్తంలోకి చేరిన చక్కెరలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే ఇదే విషయాన్ని పరిశోధకులు అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు.

అధ్యయనం కోసం కొంత మందిని తీసుకొని వారిని రెండు బృందాలుగా చేసి, వారిలో కొంతమందిని తిన్న తర్వాత కదలకుండా ఉండే పని అప్పగించి, మరి కొంతమందిని శ్రమ కలిగించే పనులు అప్పచెప్పారు. ఆ తర్వాత వారి ఇద్దరినీ పరిశీలించగా.. తిన్న అరగంట లోపు శరీరాన్ని శ్రమ పెట్టిన కొంతమందిలో బ్లడ్ గ్లూకోజ్ నియంత్రణలో ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అదేవిధంగా తక్కువ శ్రమతో కూడిన పనులను 10 నిమిషాల పాటు చేసినా కూడా మంచి ఫలితాలు కనిపించాయి.