Site icon HashtagU Telugu

Rainy Season : వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలకు చాలావరకు దూరంగా ఉండండి..

Heavy Rainfall

must take care about food in Rainy Season

వర్షాకాలం(Rainy Season) వచ్చింది అంటేనే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటివి వెంట వెంటనే వస్తాయి. కాబట్టి వర్షాకాలంలో మనం తినే ఆహారపదార్థాల(Food) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఆహార పదార్థాలకు మాత్రం దూరంగా ఉంటే మంచిది.

* పానీ పూరీ అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ వానాకాలంలో నీరు కలుషితం అయ్యి వాంతులు, విరోచనాలు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పానీపూరీ వానాకాలంలో తినకూడదు.
* పచ్చి కూరగాయలను ఈ కాలంలో తినకూడదు తింటే మన శరీరంలో గ్యాస్ ఫామ్ అవుతుంది. ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
* చేపలు, రొయ్యలు వంటివి వానాకాలంలో సంతానోత్పత్తిని కలుగజేస్తాయి కాబట్టి వాటిని ఈ కాలంలో తినకూడదు తింటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
* పుట్టగొడుగులు ఈ వానాకాలంలో తినకూడదు వీటిని తింటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
* ఫ్రై చేసిన ఆహారపదార్థాలను కూడా ఈ కాలంలో తీసుకోకూడదు.
* మామిడిపండ్లను వానాకాలంలో తింటే పిత్త, వాత, కఫ దోషాలు పెరుగుతాయి.
* వానాకాలంలో పండ్లరసాలను ఎక్కువగా తీసుకోకూడదు.
* మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోకూడదు.
* కాచి చల్లార్చిన నీటినే తాగాలి మంచినీళ్లను మామూలుగా తాగకూడదు.
* వేడి వేడి ఆహారాన్ని తినాలి, చల్లారిన ఆహారాన్ని తినకూడదు.
* వర్షాకాలంలో ఎక్కువగా బయట ఆహారం తినకూడదు.

వానాకాలంలో ఆహార పదార్థాలలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

 

Also Read : Mushroom Omelette: వెరైటీగా మష్రూమ్స్ ఆమ్లెట్.. టేస్ట్ కూడా అద్భుతం?