Site icon HashtagU Telugu

Raw Banana: పచ్చి అరటికాయ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 16 Jun 2024 02 04 Pm 7463

Mixcollage 16 Jun 2024 02 04 Pm 7463

అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. సీజన్ లతో సంబంధం లేకుండా ఈ అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా అరటి పండుని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కేవలం అరటిపండు వల్ల మాత్రమే కాకుండా వచ్చి అరటికాయ వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది పచ్చి అరటికాయను కేవలం కూరల కోసం అలాగే చిప్స్ తయారీల కోసం మాత్రమే ఉపయోగిస్తారు అని అనుకుంటూ ఉంటారు.

పచ్చి అరటికాయను తరచూ ఆహారంలో చేర్చుకోవటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే వీటిలో ఫైబర్ అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పచ్చి అరటి కాయ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పచ్చి అరటిపండు కార్బోహైడ్రేట్లకు మంచి మూలంగా పనిచేస్తుంది. ఇవి శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. అదేవిధంగా చర్మానికి కూడా మేలు చేస్తుంది.

పచ్చి అరటిపండ్లలో ఉండే విటమిన్ సి చర్మానికి మేలు చేస్తుంది. ఇది చర్మంపై ముడతలు, మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచటంలో కూడా పచ్చి అరటి కాయ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ అరటిపండ్లలో ఉండే పొటాషియం శక్తి స్థాయిలను పెంచడంలో సహాయ పడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి మంచిది. పచ్చి అరటిపండ్లలో ఉండే మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి మంచిది. అయితే, పచ్చి అరటిపండ్లను అనేక విధాలుగా తినవచ్చు. వాటిని ఉడికించి, వేయించి, పులుసులో వేసి, చిప్స్ గా కూడా తినవచ్చు.

పచ్చి అరటిపండ్లతో చేసిన పిండిని కూడా అనేక వంటకాలలో ఉపయోగించవచ్చు. అలాగే పచ్చి అరటిపండ్లను తినేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. పచ్చి అరటిపండ్లను ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. వీటిని గమనించి తీసుకోవటం మంచిది. మధుమేహం ఉన్నవారు పచ్చి అరటిపండ్లను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.