Site icon HashtagU Telugu

Rainy Season Vegetables : వర్షాకాలంలో ఎక్కువగా తినాల్సిన కూరగాయలు ఇవే..

Must Eat these Vegetables in Rainy Season it heps to our Health

Must Eat these Vegetables in Rainy Season it heps to our Health

వర్షాకాలంలో(Rainy Season) ఆరోగ్యపరంగా(Health) చాలా జాగ్రత్తగా ఉండాలి. తాగే నీరు(Water) వేడి చేసుకొని తాగాలి. వర్షాకాలంలో మాంసాహారం(Non Veg) తింటే అరగదు కాబట్టి ఎక్కువగా శాఖాహారం(Veg Food) మాత్రమే తినాలి. వర్షాకాలంలో ఎక్కువగా తినాల్సిన కూరగాయలు గుమ్మడికాయ(Pumpkin), ఉసిరి, కాకరకాయ(Bitter Gourd), బీన్స్(Beans), బెండకాయ(Ladies Finger). పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన కూరగాయలను వర్షాకాలంలో వాడకూడదు.

గుమ్మడికాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో తొందరగా జీర్ణం అవుతుంది. ఇది ఈ కాలంలో తక్కువ ధరకే లభిస్తాయి. గుమ్మడికాయతో కూర, పులుసు, హల్వా, వడియాలు చేసుకొని తినవచ్చు. ఇలా ఏదో ఒక రకమైన వంటకం చేసుకొని గుమ్మడికాయను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వర్షాకాలంలో లభించే బెండకాయ ఎంతో రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

వర్షాకాలంలో బీన్స్, చిక్కుడుకాయలు, సోయా బీన్ వంటివి విరివిగా లభిస్తాయి. ఇవి ధర తక్కువగాను మనకు ఆరోగ్యంగానూ ఉంటాయి. వీటిలోనికి తొందరగా కీటకాలు జేరవు. కాకరకాయ చేదుగా ఉంటుంది. కానీ దానితో కూర, వేపుడు చేసుకొని తినవచ్చు. మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు కాకర రసాన్ని తాగితే చాలా మంచిది.

ఉసిరిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఉసిరి పచ్చడిని తినవచ్చు. ఉసిరి వల్ల ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. ఉసిరి పుల్ల పుల్లగా ఎంతో రుచిగా బాగుంటుంది. కాబట్టి మన ఆరోగ్యం బాగుండేలా మనకు రుచిగా ఉండేలా వర్షాకాలంలో ఈ కూరగాయలను తినవచ్చు. దీని వలన మన ఆరోగ్యం బాగుంటుంది.

 

Also Read : Beerakaya Nuvvula Pachadi: ఎంతో రుచిగా ఉండే బీరకాయ నువ్వుల పచ్చడి.. టేస్ట్ అదుర్స్?