Site icon HashtagU Telugu

Summer Drinks : వేసవిలో శరీరం డీ హైడ్రేట్ అవ్వకుండా ఈ డ్రింక్స్ తాగండి..

Must Drink these Drinks in Summer

Summer Drinks

Summer Drinks : వేసవిలో మనం ఎంత నీరు తాగిన మన శరీరం డీహైడ్రేట్ కి గురవుతుంది. వేడి వాతావరణం ఎక్కువగా ఉండడం వలన మన శరీరం తొందరగా అలసటకు గురవుతుంది. వేడి వాతావరణం వలన మనకు ఒత్తిడి, నీరసం, తలనొప్పి, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన శరీరం హైడ్రేట్ గా ఉంచడం కోసం మనం సమ్మర్లో కొన్ని డ్రింక్స్ రెగ్యులర్ గా తాగాలి. దీని వలన మనం ఎండాకాలంలో ఎటువంటి అనారోగ్య సమస్యకు గురి కాకుండా ఉండవచ్చు.

*నిమ్మకాయలో ఉండే విటమిన్ సి అనేది మన శరీరానికి రోగనిరోధకశక్తిని అందిస్తుంది. కావున నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, సరిపడ పంచదార నీళ్ళల్లో కలుపుకొని తాగితే అది మనకు వెంటనే శక్తిని ఇస్తుంది.

*కొద్దిగా జీలకర్ర, మిరియాలను వేయించుకొని పొడి చేసుకోవాలి. ఆ పొడికి ఆమ్ చూర్ పొడిని కలపాలి. దీనిని ఒక గ్లాస్ లో వేసి దానికి తగినంత పంచదార వేసి చల్లని నీటిని కలపాలి. చివరకు కొద్దిగా నిమ్మరసం కలపాలి అంతే జల్ జీరా రెడీ. ఈ జల్ జీరా తాగడం వలన మనకు జీర్ణ సమస్యలు, వాంతులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు మంచి మందులా పని చేస్తుంది. మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

*ఆమ్ పన్నా దీనిని మామిడికాయలతో తయారుచేస్తారు. ఇది కూడా ఎండాకాలంలో మనల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

*కొబ్బరి నీళ్ళు రోజు తాగడం వలన మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. కొబ్బరి నీళ్ళు మనకు ఎటువంటి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.

*వేసవిలో మజ్జిగ కూడా రోజు తాగవచ్చు ఇది కూడా మనకు మన శరీరం హైడ్రేట్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

*చెరుకురసం తాగడం వలన కూడా ఎండాకాలంలో మన శరీరంలో తేమ శాతం పెరుగుతుంది.

*పుచ్చకాయ తినడం, పుచ్చకాయ జ్యూస్ తాగడం వలన కూడా మన శరీరం డీ హైడ్రేట్ నుంచి తప్పించుకుంటుంది.

కాబట్టి వేసవిలో ఎండ నుండి మన శరీరం హైడ్రేట్ గా ఉంచడం కోసం తాజా కొబ్బరినీళ్ళు, చెరుకురసం, పుచ్చకాయ జ్యూస్, మజ్జిగ, జల్ జీరా, ఆమ్ పన్నా, నిమ్మరసం వంటివి తాగాలి.

Also Read : Summer Tips : వేసవిలో AC , కూలర్ వాడకుండా ఇంటిని చల్లగా ఉంచే టిప్స్..