Muskmelon: కర్బూజా పండ్లను తెగ తినేస్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?

మామూలుగా వేసవికాలం వచ్చింది అంటే చాలు మనకు రకరకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో కర్బూజా పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు ఎ

  • Written By:
  • Publish Date - February 4, 2024 / 02:00 PM IST

మామూలుగా వేసవికాలం వచ్చింది అంటే చాలు మనకు రకరకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో కర్బూజా పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు ఎక్కువగా వేసవి కాలంలోనే లభిస్తూ ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఎండాకాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యానికి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా శరీరం హైడ్రేషన్ బారిన పడకుండా చూస్తాయి. ఇది కొంతమంది కర్బూజా పండ్లు తీయగా బాగా ఉంటాయి అని తెగ లాగించేస్తూ ఉంటారు. కొందరు జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు.

కొందరు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కెర వేసుకొని కలుపుకొని తింటూ ఉంటారు. దాని వల్ల వేసవి బాధ నుంచి కాసేపు ఉపశమనం కలిగినట్టు ఉంటుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే తర్బూజా పండ్లను జ్యూస్ లా చేసుకొని చక్కెర కలుపుకొని తాగడం కన్నా, తేనె కలుపుకొని తాగడం మేలు. అయితే అసలు వేసవి కాలంలో తర్బూజా పండ్లను తినొచ్చా? లేదా? తింటే ఏమౌతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వేసవి కాలంలోనే కాదు ఏకాలంలో అయినా సరే కర్బూజా పండ్లను ఖచ్చితంగా తినాల్సిందే. ఈ పండ్లలో ఉండే విటమిన్లు మరే పండ్లలో ఉండవు. శరీరానికి కావాల్సిన విటమిన్లు చాలా ఈ పండులో ఉంటాయి.

ఈ పండులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సీ తో పాటు విటమిన్ ఏ, కే, బీ6 ఉంటాయి. అలాగే పుష్కలంగా మినరల్స్ కూడా ఉంటాయి. పొటాషియం, ఫోలేట్ యాసిడ్, నియాసిన్, మెగ్నీషియం, థయామిన్ తర్బూజాలో కావాల్సినంత ఉంటాయి. అందుకే రోజూ ఓ రెండు తర్బూజా చెక్కలు తింటే చాలు శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ అందుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే తర్బూజా పండు ఎంతో మేలు చేస్తుంది. కర్బూజా పండ్లలో ఎక్కువ శాతం నీరు ఉండటం వల్ల ఈ పండు తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో వేరే ఆహారం తీసుకోవడం తగ్గిస్తారు. ఈ పండులో క్యాలరీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. క్యాన్సర్, గుండె జబ్బులు లాంటివి కూడా దరిచేరకుండా ఉండాలంటే తర్బూజాను రోజూ తినాల్సిందే. డీహైడ్రేషన్ సమస్యలు తగ్గాలన్నా,శరీరాన్ని వేసవి కాలంలో చల్లగా ఉంచాలన్నా నీరసంగా ఉన్నా ఈ పండును తినేయాలి.