Site icon HashtagU Telugu

Mushroom: మష్రూమ్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 07 Jul 2024 03 14 Pm 9150

Mixcollage 07 Jul 2024 03 14 Pm 9150

మష్రూమ్స్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ చాలామంది మష్రూమ్స్ తినడానికి అంతగా ఇష్టపడరు. మష్రూమ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు. వీటిని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు వైద్యులు. మరి మష్రూమ్స్ వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా మష్రూమ్స్ ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బీపీ లెవెల్స్ తగ్గుతాయట. ఎందుకంటే మష్రూమ్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులోని ఖనిజాలు సోడియంకి వ్యతిరేకంగా పోరాడుతాయి రిలాక్స్ నరాలను కూడా రిలాక్స్‌ చేస్తాయి బీపీ లెవెల్స్ తగ్గిపోతాయి. అంతేకాదు మష్రూమ్స్ లో సోడియం కూడా తక్కువ పరిణామంలో ఉంటుంది. మష్రూమ్స్‌తో వివిధ రకాల రెసిపీలు తయారు చేసుకుంటారు ఈ సోడియం బీపీతో బాధపడే వారికి మష్రూమ్ కి బెస్ట్ రెమెడీ గా చెప్పవచ్చు. కాగా మష్రూమ్స్ లో సెలీనియం, విటమిన్ డి, విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటాయి.

సెలీనియం సెల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది విటమిన్ డి కణాల అభివృద్ధికి విటమిన్ బి 6 మన శరీరంలో ఎర్ర రక్త కణాలు అభివృద్ధికి సహాయపడుతాయట. ఈ మూడు కలగలిపిన పోషకాలు మష్రూమ్స్ లో ఉంటాయి. కాగా మన ఆరోగ్యకరమైన డైట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలు చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఆంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండే ఆహారాలు చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మష్రూమ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇది కణ వ్యవస్థను బలపరుస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్న మష్రూమ్స్ ఒబెసిటీ రాకుండా కూడా కాపాడుతుంది హైపర్ టెన్షన్ సమస్యలను తగ్గిస్తుంది. పుట్టగొడుగులు గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తాయి. పుట్టగొడుగులు తరచుగా తీసుకోవడం వల్ల మన పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో మంచి బ్యాక్టిరియా పెరుగుదలకు తోడ్పడుతుంది. పేగు కదలికలకు సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.