పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటూ ఉంటారు. కొందరు ఇష్టంగా తింటే మరికొందరు వీటిని తినడానికి ఎంతగా ఇష్టపడరు. ఈ మధ్యకాలంలో ఇవి ఏడాది పొడవునా ఇవి మనకు మార్కెట్లో మనకు లభిస్తూనే ఉన్నాయి. కాగా పుట్ట గొడుగుల్లో సెలీనియం, ఎర్గోథియోనైన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్లు, రాగి వంటివి ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల పెరుగుదలకు సహాయపడతాయట.
అంతేకాకుండా పొటాషియం, రాగి, ఐరన్, భాస్వరం లాంటి ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయట. పుట్ట గొడుగులు తింటే కొన్ని జబ్బులు మన జోలికి కూడా రావని చెబుతున్నారు. అలాగే పుట్ట గొడుగుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ లాంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయట. ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ లను తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తాయి అని చెబుతున్నారు. సెలీనియం క్యాన్సర్ ని నివారిస్తుందని చెబుతున్నారు. పుట్టగొడుగుల్లో విటమిన్ డి, కోలిన్ ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్ లను నివారించడంలో లేదా చికిత్స చేయడంలో విటమిన్ డి, కోలిన్ సహాయపడుతుందట.
అంతేకాకుండా ఈ మష్రూమ్స్ మెదడు ఆరోగ్యాన్ని ఎంతో బాగా కాపాడతాయట. ఇందులో ఉండే అనేక పోషకాలు మొదటి కణాలను ఉత్తేజపరుస్తాయట. జ్ఞాపకశక్తిని పెంచుతాయని, బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉండాలంటే కనీసం వారానికి ఒక్కసారైనా పుట్టగొడుగులు తీసుకోవాలని చెబుతున్నారు. మనం తినే ఆహారంలో భాగంగా వీటిని చేర్చుకోవడం వల్ల అనేక రకాల లాభాలను పొందవచ్చు అని చెబుతున్నారు. అయితే వీటిని తినేవారు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.