Munakkada Vullikaram : మునక్కాడ ఉల్లికారం.. వేడి వేడి అన్నంలో తింటే ఆహా..

మునక్కాడలతో తయారు చేసే వంటకాల్లో మునక్కాడ ఉల్లికారం కూడా ఒకటి. ఉల్లిగడ్డకారం వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే..

Published By: HashtagU Telugu Desk
Munakkada Vullikaram

Munakkada Vullikaram

Munakkada Vullikaram : ప్రతిరోజూ ఆహారంగా తీసుకునే కూరగాయల్లో మునక్కాడలు కూడా ఒకటి. వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. సాంబార్, పప్పుచారు వంటి వాటిలో మునక్కాడలు వేస్తే.. వాటికి వచ్చే రుచే వేరు. మునక్కాడలతో ఇంకా రకరకాల వంటకాలు కూడా చేసుకోవచ్చు. మునక్కాడ -టమాట, మునక్కాడ మసాలా వంటివి తయారు చేసుకోవచ్చు. మునక్కాడలతో తయారు చేసే వంటకాల్లో మునక్కాడ ఉల్లికారం కూడా ఒకటి. ఉల్లిగడ్డకారం వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే.. అస్సలు వదిలిపెట్టరు. మరి ఈ మునక్కాడ ఉల్లికారం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో, అందుకోసం ఏయే పదార్థాలు కావాలో తెలుసుకుందాం.

మునక్కాడ ఉల్లికారం తయారీకి కావలసిన పదార్థాలు

నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1/2 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1/2 టీ స్పూన్
తరిగిన ఉల్లిపాయ – 1
ఉప్పు – తగినంత
కరివేపాకు – 1 రెమ్మ
తరిగిన మునక్కాయ -1
తరిగిన టమాటాలు -2
పసుపు – 1/2 టీ స్పూన్
నానబెట్టిన చింతపండు – 1 రెమ్మ

ఉల్లికారం తయారీ విధానం

ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. వీటిని జార్ లోకి తీసుకుని.. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో మళ్లీ నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత మునక్కాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు వేసి కలపాలి. వీటన్నింటినీ వేయించిన తర్వాత టమాట ముక్కలు, పసుపు వేసి కలుపుకోవాలి.

ఆ తర్వాత మూత పెట్టి టమాట ముక్కల్ని మెత్తగా అయ్యేంతవరకూ వేయించాలి. ఇవి మెత్తగా అయ్యాక మునక్కాయ ముక్కలు ఉడికేందుకు సరిపడా నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఇందులో నీరంతా ఇగిరిపోయి ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత.. ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్న కారం, చింతపండు గుజ్జు వేసి కలుపుకుని.. మూత పెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలేంతవరకూ ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టఫ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే మునక్కాడ ఉల్లికారం రెడీ.

Also Read : Loose Motions Remedies: సింపుల్ హోం రెమెడీస్ తో లూజ్ మోషన్స్ ఆపండి ఇలా..!

 

  Last Updated: 16 Oct 2023, 10:35 PM IST